గిరిజన సంస్కృతికి ప్రతీక.. తీజ్‌ | Teej tribal culture, symbolizing . | Sakshi
Sakshi News home page

గిరిజన సంస్కృతికి ప్రతీక.. తీజ్‌

Published Fri, Sep 2 2016 12:04 AM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

Teej tribal culture, symbolizing .

  • శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి
  • చిట్యాల : తీజ్‌ పండుగ గిరిజనుల సంస్కృతి, సం ప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని భావుసింగ్‌పల్లిలో సర్పంచ్‌ అజ్మీరా జ్యోతి ఆధ్వర్యంలో గురువారం తీజ్‌ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భం గా గిరిజన యువతులు గోధుమ బుట్టలతో నృత్యా లు చేసిన అనంతరం ప్రదర్శనగా వెళ్లి నిమజ్జనం చేశారు. కార్యక్రమానికి హాజరైన స్పీ కర్‌ మాట్లాడుతూ సంప్రదాయాన్ని మరిచిపోకుం డా గిరిజనులు తీజ్‌ ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అలాగే, ఎంపీటీసీ అజ్మీరా శారద, కాంగ్రెస్‌ నాయకుడు అజ్మీ రా దేవేందర్‌ ఆధ్వర్యంలో అదే గ్రామంలో తీజ్‌ ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో రవీందర్, అజ్మీరా శ్రీనివాస్, అజ్మీరా శ్రీను, రా జు, దేవేందర్, కుంచాల సదావిజయ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, గణపతి, సధాకర్, సంపత్, శం కర్, లసుమయ్య, సదానందం పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement