గర్వం, అహంకారం పెంచుకోవద్దు: కేసీఆర్ | telangana chief minister kcr speaks over warangal election results | Sakshi
Sakshi News home page

గర్వం, అహంకారం పెంచుకోవద్దు: కేసీఆర్

Published Wed, Nov 25 2015 1:50 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

గర్వం, అహంకారం పెంచుకోవద్దు: కేసీఆర్ - Sakshi

గర్వం, అహంకారం పెంచుకోవద్దు: కేసీఆర్

హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక విజయం కొత్త చరిత్రకు నాంది పలికిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్తో పాటు పలువురు మంత్రులు బుధవారం ఉదయం కేసీఆర్‌ను కలిశారు. పసునూరికి ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు.

తెలంగాణ ప్రజలు వరంగల్ ఘనవిజయంతో టీఆర్ఎస్ పార్టీని ఎంతో గౌరవించారని కేసీఆర్ అన్నారు. అభివృద్ధిలో జిల్లాకు తగిన ప్రాధాన్యం ఉంటుందని వరంగల్ నాయకులకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ విజయంతో గర్వం, అహంకారం పెంచుకోవద్దని కేసీఆర్ సలహా ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కార్యకర్తలు ప్రజలకు రక్షణ కవచంలా నిలవాలని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement