![అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధం](/styles/webp/s3/article_images/2017/09/5/61488064646_625x300.jpg.webp?itok=57h0WO3j)
అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధం
వెంకటాపురం(నూగూరు) : ఆలుబాక పంచాయతీ పరిధి కలిపాక గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మిడెం మురళి, సోడే రామయ్య, కట్టం బాలకృష్ణ, సోడి సమ్మయ్యలకు చెందిన పూరిళ్లు దగ్ధమయ్యాయి. వీరంతా కూలీ పనులకు వెళ్లడంతో ఇళ్లలో ఎవరూ లేరు. దీంతో సామగ్రి పూర్తిగా కాలి పోయింది. ఇళ్లకు నిప్పంటుకుని మంటలు చేలరేగటాన్ని గమనించిన గ్రామస్తులు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఎట్టకేలకు ఆలుబాక గ్రామ సర్పంచ్ సమ్మయ్య కలిపాక గ్రామం నుంచి ట్యాంకర్లతో నీటిని తెప్పించి మంటలను చల్లార్పారు. అప్పటికే అంతా బూడిదయిపోయింది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాదంలో మిడెం మురళికి చెందిన రూ.30 వేల నగదు, 20 బస్తాల ధాన్యం, 10 బస్తాల జొన్నలు, ఒక మోటార్ సైకిల్, సోడి సమ్మయ్యకు చెందిన రూ.10 వేల నగదు, 15 బస్తాల ధాన్యం, 10 బస్తాల జొన్నలు, పట్టాదారు పాస్ పుస్తాకాలు కాలిపోయాయి. సూ మారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఆర్‌ఐ కామేశ్వరావు సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి పంచనామా నిర్వహించి ప్రమాదం జరగటానికి గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.