- l ఎన్‌టీపీసీ నుంచి విద్యుత్‌అందించడం హర్షణీయం
- l బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి
ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభంతో ఉపాధి
Published Tue, Aug 2 2016 12:09 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM
పాలకుర్తి టౌన్ : రామగుండంలో 20 సంవత్సరాల క్రితం మూతపడిన ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగ స్టు 7న పునఃప్రారంభం చేయబోతుండడం హర్షణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు.
సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల ఫ్యాక్టరీ కోసం కేంద్రం రూ.600 కోట్లు నిధులు ఇచ్చిందన్నారు. ఫ్యాక్టరీ వలన ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఎన్‌టీపీసీ నుంచి 4000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంను జాతికి అంకితం చేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో బీజే పీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని అశోక్ రెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పెదగాని సోమయ్య, జిల్లా కార్యదర్శి శ్రీమాన్, దొంగరి మహేందర్, పల్లె కుమార్, శ్రీకాంత్, అనిల్, సునిల్, సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement