వెంగళరావునగర్ : వెనుకబడిన దేశాలు ఆర్థిక ప్రగతిని సాధించడంలో యువత పాత్ర కీలకమని కేంద్రమంత్రి (ఎంఎస్‌ఎంఈ) హరిబాయి పార్ధిబాయి చౌదరి అభిప్రాయపడ్డారు. యూసుఫ్‌గూడ డివిజన్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ కేంద్ర శిక్షణా సంస్థలో మూడు నెలలుగా నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.
దేశ విదేశాల్లోని ప్రతినిధులకు నిమ్స్‌మేలో శిక్షణ ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న పలు దేశాల ప్రతినిధులకు కేంద్రమంత్రి చౌదరి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ ఎం. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నిమ్స్‌మే సీఏఓ డాక్టర్ వల్లభరెడ్డి, నిమ్స్‌మే ఫ్యాకల్టీ డాక్టర్ దిబ్యేందు చౌదరి, డాక్టర్ ఎన్ . శ్రీనివాసరావు పాల్గొన్నారు.