vengalraonagar
-
కరాటే కల్యాణి ఎక్కడికి వెళ్లింది..? ఎప్పుడు వస్తుంది..?
సాక్షి, హైదరాబాద్(వెంగళరావునగర్): ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైన్ అధికారులు, పోలీసులు ఆదివారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధికారులు తెలిపిన మేరకు.. సినీనటి కరాటే కళ్యాణి గత కొన్నేళ్ళుగా అక్రమంగా పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతుందని 1098 నెంబర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు మహేష్, సంతోష్‌కుమార్ ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీలో శ్రీలక్ష్మినిలయం అపార్ట్‌మెంట్స్‌కు ఆదివారం వచ్చారు. ఆ సమయంలో కల్యాణి, పిల్లలు ఇంట్లో లేరు. కల్యాణి తల్లి మాత్రమే ఉంది. తన కూతురు గుడికి వెళ్లిందని, ఎప్పుడు వస్తుందో తెలియదని సమాధానం చెప్పింది. తన కుమార్తె ఒక బాబు (12 ఏళ్లు)ను, ఐదు నెలల పాపను పెంచుకుంటోందని, అందులో తప్పేముందని ప్రశ్నించింది. అయితే వారిని ఎక్కడనుంచి తెచ్చిందనే విషయం మాత్రం తనకు తెలియదని విలేకరులతో చెప్పారు. ఇదిలా ఉండగా చైల్డ్ లైన్ అధికారులు ఇంటివద్దకు విచారణకు వస్తున్నారని తెలిసిన కరాటే కల్యాణి ఎక్కడి వెళ్లింది ? ఎప్పుడు వస్తుంది ? దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయాలను అటు అధికారులు, ఇటు పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: (కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు) -
ప్రకృతి వైద్యంతోనే ఆరోగ్యం
వెంగళరావునగర్: భారతీయ వైద్యాన్ని పరిరక్షించడానికి, దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ తెలిపారు. హైదరాబాద్‌లోని వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని యునానీ కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలో (యునా నీ ఆసుపత్రి) ఇటీవల ఆధునీకరించిన భవన సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం యునానీ ఆస్పత్రి హాల్లో జరిగిన సమావేశంలో యశోనాయక్ మాట్లాడుతూ.. ప్రకృతి వైద్యంతోనే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. యునానీ, ఆయుర్వేదం, సిద్ధ, యోగ, ప్రకృతి చికిత్స తదితర విధానాల ద్వారా దీర్ఘకాలిక రోగాలు సైతం మాయం అవుతాయని చెప్పారు. దీని ని ప్రతి ఒక్కరూ విశ్వసించాలన్నారు. యునా నీ, ఆయుర్వేదం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మరోసారి రోగం తిరిగి రాకుండా పూర్తి స్థాయిలో నయం అవుతుందని తెలిపారు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం మన భారతీయ వైద్యాన్ని క్షేత్రస్థాయి నుంచి ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త మందులను తయారు చేయి స్తున్నామని చెప్పారు. ఇందుకోసం కోట్లాది రూపాయల బడ్జెట్‌ను ప్రధాని మోదీ కేటాయిస్తున్నారన్నారు. దేశంలో 50 ప్రాంతాల్లో ప్రకృతి వైద్యానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటికి నిరంతరం నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. ప్రజలకు విశ్వాసం కల్పించాలి: కిషన్‌రెడ్డి యునానీ మీద మరింతగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రకృతి వైద్యం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని, అయితే ఎలాంటి ప్రమా దం లేదని వారికి మనం నిరూపించి అనుమానాలను నివృత్తి చేయాలని వైద్యులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ అడిషనల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ పాఠక్, యునానీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మునావర్ హుస్సేన్ ఖజ్మీలతో పాటు ఆయుర్వేద, సిద్ధ, ప్రకృతి వైద్యాలయం, యోగా తదితర ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. భవన సముదాయాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు యశోనాయక్, కిషన్‌రెడ్డి -
ఆర్థికాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
వెంగళరావునగర్ : వెనుకబడిన దేశాలు ఆర్థిక ప్రగతిని సాధించడంలో యువత పాత్ర కీలకమని కేంద్రమంత్రి (ఎంఎస్ఎంఈ) హరిబాయి పార్ధిబాయి చౌదరి అభిప్రాయపడ్డారు. యూసుఫ్‌గూడ డివిజన్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ కేంద్ర శిక్షణా సంస్థలో మూడు నెలలుగా నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. దేశ విదేశాల్లోని ప్రతినిధులకు నిమ్స్‌మేలో శిక్షణ ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న పలు దేశాల ప్రతినిధులకు కేంద్రమంత్రి చౌదరి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ ఎం. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నిమ్స్‌మే సీఏఓ డాక్టర్ వల్లభరెడ్డి, నిమ్స్‌మే ఫ్యాకల్టీ డాక్టర్ దిబ్యేందు చౌదరి, డాక్టర్ ఎన్ . శ్రీనివాసరావు పాల్గొన్నారు.