స్పాట్‌ అడ్మిషన్లు | the spot Admission | Sakshi
Sakshi News home page

స్పాట్‌ అడ్మిషన్లు

Published Mon, Sep 26 2016 11:57 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

the spot Admission

నిజామాబాద్‌నాగారం:
గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో ఎంఏ ఇంగ్లిష్, ఎకనామిక్స్, ఎం.కాం, ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలాజీ పీజీ కోర్సులతో పాటు బీఎల్‌ఐఎస్సీ కోర్సులో ఖాళీగా ఉన్న సీట్లను బుధవారం మధ్నాహ్నం 12 గంటలకు స్పాట్‌ అడ్మిషన్స్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ రాంమోహన్‌రెడ్డి తెలిపారు. ఓయూసెట్‌–2016లో ర్యాంక్‌ పొందిన విద్యార్థులు బుధవారం ఉదయం 11 గంటల్లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకొని, స్పాట్‌ అడ్మిషన్‌కు హాజరు కావాలని సూచించారు. ఓయూసెట్‌–2016లో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా, ఖాళీల సంఖ్య బట్టి సీట్లు కేటాయిస్తామని, అడ్మిషన్‌ పొందే వారు తక్షణమే ఒరిజినల్‌ టీసీ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే కోర్సుకు సంబంధించిన మొత్తం ఫీజు, డెవలప్‌మెంట్‌ ఫండ్, యూనివర్సిటీ కామన్‌ సర్వీసు ఫీజును వెంటనే చెల్లించాల్సి ఉంటుందని, వీరు ఫీజు రీయింబెర్సుమెంట్‌ అర్హులు కారన్నారు. ర్యాంక్‌ కార్డు, డిగ్రీ టీసీ, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్‌తో పాటు ఒకసెట్‌ జిరాక్స్‌ తీసుకొని రావాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement