ఈ తప్పెవరిది? | who are responsibilty for pg counselling mistake | Sakshi
Sakshi News home page

ఈ తప్పెవరిది?

Published Thu, Jul 10 2014 2:23 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

ఈ తప్పెవరిది? - Sakshi

ఈ తప్పెవరిది?

‘విద్యార్థులకు పీజీ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ఉందనే విషయూన్ని కళాశాలల యూజమాన్యాలు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పటికప్పుడు మార్కుల జాబితా ఇవ ్వడానికి అవి చేతితో రాసిచ్చేవి కావు. విద్యార్థుల అవసర నిమిత్తం మెమోలను ప్రింట్ చేరుుంచడానికి యూనివర్సిటీలోని ఓ అధికారికి బాధ్యతలు అప్పగించాం. దానికంటే ఇంకా మేం చేసేది ఏముంటది. సమాచారాన్ని సకాలంలో అందిస్తే ఏదైనా చర్య తీసుకునే వీలుండేది.’
- కడారు వీరారెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్
 
‘పీజీ కౌన్సెలింగ్ గురించి శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి భరత్‌కు తెలిపాం.     ఆయన సరైన సమయంలో స్పందించలేదు. విద్యార్థులు వెళ్లి కలిసినా.. ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదు. చివరి క్షణంలో తాము ఏదో చేశామని చెప్పుకోవడానికి ఓ లెటర్ కౌన్సెలింగ్ రోజు సాయంత్రం 3 గంటలకు ఇస్తే అప్పటికప్పుడు ఒరిజినల్ లెటర్‌ను హైదరాబాద్‌కు ఎలా చేరవేసేది. ముందుగానే మార్కుల మెమోలు ఇస్తే బాగుండేది.’
- గాయత్రీదేవి, రాజరాజేశ్వర సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్, వేములవాడ
 
శాతవాహన యూనివర్సిటీ : జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర సంస్కృత కళాశాలలో పలువురు విద్యార్థులు 2013-14లో డిగ్రీ పూర్తిచేశారు. పీజీలో ప్రవేశం పొందడానికి ఉస్మానియూ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాశారు. దాదాపు అందరు విద్యార్థులు వందలోపు ర్యాంకు సాధించారు. అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నచందంగా పీజీ సెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయూరు. సంస్కృత కళాశాలనుంచి విద్యార్థులకు మార్కు లు జాబితా అందకపోవడమే దీనికి కారణం. అధికారుల నిర్లక్ష్యంతో ఉన్నత విద్యకు నోచుకోలేకపోయూమని విద్యార్థులు లబోదిబోమంటున్నారు.
 
నష్టపోయిన విద్యార్థులు వీరే...
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఏ ప్రవేశపరీక్షలో ర్యాంకులు సాధించి కౌన్సెలింగ్‌కు అర్హత కోల్పోయిన వారి లో నగేశ్(వర్సిటీ 6వ ర్యాంకు), బ్రహ్మచారి (వర్సిటీ 7వ ర్యాంకు), ప్రసాద్ (23వ), రాజేశ్ (45వ ర్యాంకు), సాగర్ (59వ ర్యాంకు), రవి (123వ ర్యాంకు) సాధించారు. కౌన్సెలింగ్ సమ యం వరకు కళాశాల నుంచి వీరికి మార్కుల మెమోలు అందలేదు. ఫలితంగా ఉన్నత విద్య కు దూరమయ్యూరు. మొదటి కౌన్సెలింగ్‌లోనే దాదాపు సీట్లన్నీ భర్తీ కావడంతో కనీసం రెండో కౌన్సెలింగ్‌లోనైనా సీటు దక్కుతుందనే ఆశ లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇలా జరగాలి...
ఫలితాలు ప్రకటించిన నెల రోజుల్లోపు యూనివర్సిటీ అధికారులు మార్కుల జాబితా అందించాల్సి ఉంటుంది. శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిగ్రీ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించారు. జూన్ 25న ఫలితాలు విడుదలచేశారు. వాస్తవానికి ఈనెల 25వ తేదీలోపు మార్కుల జాబితా యూనివర్సిటీ అధికారులు ఆయూ కళాశాలలకు అందించాలి. మార్కుల జాబితా పొందాలంటే కళాశాలల వారు వర్సిటీ సూచించినా నిర్ణీత నమూనాలో విద్యార్థుల సమాచారం అందించాల్సి ఉంటుంది. నామినల్ రోల్స్ విధిగా సమర్పించాలని నిబంధన ఉంది.
 
పరస్పర విరుద్ధ ఆరోపణలు
విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉందనే విషయాన్ని ముందుగా తమకు సమాచారం ఇచ్చి ఉంటే తప్పనిసరిగా మార్కుల జాబితాను అందించే వాళ్లమని యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. వారం క్రితమే శాతవాహన యూనివర్సిటీలో పరీక్షల నియంత్రణ అధికారికి కౌన్సెలింగ్ గురించి తెలిపామని ఆయన సరైన సమయంలో స్పందించలేదని, కౌన్సెలింగ్ రేపు అనగా యూనివర్సిటీకి విద్యార్థులతో వెళ్లినా మార్కుల జాబితాలు లేకున్నా కంట్రోలర్ ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదని వేములవాడ సంస్క­ృత కళాశాల ప్రిన్సిపాల్ అంటున్నారు. కౌన్సెలింగ్ రోజు విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కంట్రోలర్‌ను అభ్యర్థించడంతో సాయంత్రం 3 గంటలకు కంట్రోలర్ ఓ లెటర్ అందించారని, దానిని హుటాహుటిన మెయిల్ ద్వారా విద్యార్థులకు పంపినా లాభం లేకుండా పోరుుందని పేర్కొంటున్నారు. ఇలా ఎవరికి వారు తమదే కరెక్టు అంటే తమదేనని వాదిస్తున్నారు. వీరి నిర్లక్ష్యానికి విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌కు దూరమయ్యూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement