మృతుడు శివ.
ఖైరతాబాద్: ఉద్యోగం రావడం లేదన్న మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కుమ్మరికుంట్లకు చెందిన శ్యామల శివ (24) నగరంలో బీటెక్ పూర్తిచేశాడు. రెండేళ్లుగా ఖైరతాబాద్ డివిజన్‌లోని మారుతీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నలుగురి స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేదు.
దీంతో మనస్థాపానికి గురైన శివ సోమవారం సాయంత్రం స్నేహితులంతా డ్యూటీలకు వెళ్లిన తరువాత గదిలో ఉరేసున్నాడు. అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు సంపత్‌కుమార్ తలుపు కొట్టినా తీయకపోవడంతో సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి మంగళవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.