
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ
కళ్యాణదుర్గం రూరల్ : స్థానిక పట్టణంలోని పార్వతీ నగర్‌లో భూపసముద్రం ఏపీజీబీ మేనేజర్ ఆంజనేయులు ఇంట్లో శనివారం చోరీ జరిగింది. ఆంజనేయులు ఐదు రోజుల క్రితం సమీప బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వచ్చి చూసే సరికి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలు, దుస్తులు చెల్లాచెదురుగా కనిపించాయి.
బీరువాలో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేలు విలువ చేసే ఎల్‌ఈడీ టీవీ చోరీకి గురైనట్లు గుర్తించారు. అదేవిధంగా అక్కడే ఉన్న అనీష్ ఇంట్లోనూ టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు. రూరల్ ఎస్‌ఐ నబీరసూల్ మాట్లాడుతూ చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.