ఏప్రిల్ 15న శ్రీరామనవమి..
16న శ్రీరామ మహాపట్టాభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 8 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఏప్రిల్ 8న దుర్ముఖి నామ సంవత్సరాది సందర్భంగా రామాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి, ఆలయ ప్రధానార్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. ఆ రోజు ఆలయంలో నూతన పంచాగ శ్రవణం ఉంటుందని, శ్రీసీతారామచంద్రస్వామి వారికి తిరువీధి సేవ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 11న బ్రహ్మోత్సవ అంకురార్పణ, 21న చక్రతీర్థం, ధ్వజావరోహణం వేడుకలుంటాయని తెలిపారు.
ఏప్రిల్ 8 నుంచి భద్రాద్రి ‘తిరుకల్యాణం’
Published Fri, Feb 26 2016 3:48 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
Advertisement
Advertisement