april 8
-
ఏప్రిల్ 8 నుంచి భద్రాద్రి ‘తిరుకల్యాణం’
ఏప్రిల్ 15న శ్రీరామనవమి.. 16న శ్రీరామ మహాపట్టాభిషేకం భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 8 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఏప్రిల్ 8న దుర్ముఖి నామ సంవత్సరాది సందర్భంగా రామాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి, ఆలయ ప్రధానార్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. ఆ రోజు ఆలయంలో నూతన పంచాగ శ్రవణం ఉంటుందని, శ్రీసీతారామచంద్రస్వామి వారికి తిరువీధి సేవ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 11న బ్రహ్మోత్సవ అంకురార్పణ, 21న చక్రతీర్థం, ధ్వజావరోహణం వేడుకలుంటాయని తెలిపారు. -
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు శుభవార్త!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులకు శుభవార్త. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా విడుదల తేదీ ఖరారైనట్టు సమాచారం. ఏప్రిల్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' ప్రాజెక్టు విషయంలో బాగా జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది దశ షూటింగ్ ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. 'జనవరి 4 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది సుదీర్ఘమైన షెడ్యూల్. దాదాపు నెలపాటు ఉంటుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. సినిమా ఏప్రిల్‌లో విడుదల చేయాలని పవన్‌కల్యాణ్ భావిస్తున్నారు' అని చిత్రానికి సంబంధించి విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయి.. ఇంకా పోస్టు ప్రోడక్షన్ వర్క్‌లోకి వెళ్లకముందే సినిమా హక్కుల కోసం డిస్టిబ్యూటర్లు పోటీపడుతున్నట్టు తెలుస్తున్నది. 2012లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్' సినిమాకు 'సర్దార్ గబ్బర్‌సింగ్' సీక్వెల్‌గా వస్తున్నది. -
టాలీవుడ్‌కి వెరీ' స్పెషల్ డే'
-
ముంబయిలో సూర్య '24' దుమ్మురేపే యాక్షన్
ముంబయి: ప్రముఖ తమిళస్టార్ సూర్య నటిస్తోన్న థ్రిల్లర్ మూవీ '24' ఏప్రిల్ 8 నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. నెల రోజులపాటు ముంబయిలో దుమ్మురేపే స్థాయిలో ఈ చిత్ర సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 'ఈ చిత్ర కథనం అంతా ముంబయికే సంబంధించనట్లుగా ఉండటంతో అక్కడే నెల రోజులపాటు తీయాలని నిర్ణయించాం' అని చిత్ర యూనిట్ తెలిపింది. సూర్య సరసన గతంలో అంజాన్ చిత్రంలో నటించిన సమంత.. ఇప్పుడు 24 చిత్రం ద్వారామరోసారి జతకట్టనున్నారు. 24 క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ అని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రాన్ని 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్యానే నిర్మిస్తున్నారు. ఇష్క్, మనం ఫేం విక్రమ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కాగా, ఆస్కార్ అవార్డు విజేత, స్వర మాంత్రికుడు ఏఆర్ రహమాన్ పాటలు స్వరపరుస్తున్నారు.