
ముంబయిలో సూర్య '24' దుమ్మురేపే యాక్షన్
ముంబయి: ప్రముఖ తమిళస్టార్ సూర్య నటిస్తోన్న థ్రిల్లర్ మూవీ '24' ఏప్రిల్ 8 నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. నెల రోజులపాటు ముంబయిలో దుమ్మురేపే స్థాయిలో ఈ చిత్ర సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 'ఈ చిత్ర కథనం అంతా ముంబయికే సంబంధించనట్లుగా ఉండటంతో అక్కడే నెల రోజులపాటు తీయాలని నిర్ణయించాం' అని చిత్ర యూనిట్ తెలిపింది.
సూర్య సరసన గతంలో అంజాన్ చిత్రంలో నటించిన సమంత.. ఇప్పుడు 24 చిత్రం ద్వారామరోసారి జతకట్టనున్నారు. 24 క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ అని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్యానే నిర్మిస్తున్నారు. ఇష్క్, మనం ఫేం విక్రమ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కాగా, ఆస్కార్ అవార్డు విజేత, స్వర మాంత్రికుడు ఏఆర్ రహమాన్ పాటలు స్వరపరుస్తున్నారు.