
ఈ ఉల్లి బరువు 400 గ్రాములు!
సాధారణంగా ఉల్లిగడ్డ ఐదు నుంచి పది గ్రాములుంటుంది. బందరు ఉల్లి అయితే 100 నుంచి 150 గ్రాములు వరకు తూగుతాయి. కానీ శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న ఉల్లిపాయలు ఒక్కో గడ్డ 350 నుంచి 450 గ్రాముల బరువు తూగుతున్నాయి. శుక్రవారం రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద విక్రయించేందుకు ఈ రాకాసి ఉల్లిని పాలకొండ వాసులు తీసుకురాగా.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
-రేగిడి