దేవుడి భూములకే దిక్కులేదు | thousend of acers temple lands is grabbing | Sakshi
Sakshi News home page

దేవుడి భూములకే దిక్కులేదు

Published Fri, Jun 24 2016 3:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

దేవుడి భూములకే దిక్కులేదు

దేవుడి భూములకే దిక్కులేదు

కబ్జా కోరల్లో ఆలయ భూములు
వేలాది ఎకరాలు అన్యాక్రాంతం
ఆక్రమించి ప్లాట్లుగా అమ్ముకుంటున్న వైనం
స్వాధీనానికి చర్యలు చేపట్టని దేవాదాయశాఖ అధికారులు
అమలుకు నోచుకోని మంత్రి ఆదేశాలు
ఆన్‌లైన్‌లో కనిపించని భూముల వివరాలు

 కనిగిరి:  జిల్లాలో వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యూరుు. పైసా కౌలు చెల్లించకుండా ఆక్రమణదారులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. కోట్లాది రూపాయూల విలువైన భూములను కొందరు దర్జాగా ప్లాట్లు వేసి విక్రరుుంచుకుంటున్నా అడిగే నాధుడే లేరు. కబ్జాకు గురైన మాన్యం భూములను స్వాధీనం చే సుకుని, వేలం ద్వారా కౌలుకిచ్చి ఆదాయం పెంచాల్సిన అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. భూముల వివరాలు ఆన్‌లైన్ చేయూలన్న అమాత్యుల ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్నారు. వందల ఎకరాల భూములు రికార్డుల్లో తప్ప ఎక్కడున్నాయో తెలియడం లేదు.

 గుర్తించినవి వందల ఎకరాలే..
జిల్లాలో 1651 దేవాలయాలుండగా, వాటి పరిధిలో 32,755 ఎకరాలు భూములున్నాయి. మీ ఇంటికి-మీ భూమి గ్రామసభల్లో రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు రెండు వేల ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైనట్టు గుర్తించారు. వాటిలో కనిగిరి నియోజకవర్గంలో వందెకరాలు మాత్రమే ఉన్నట్లు తేల్చారు. వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలో మరో 3,500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు సమాచారం. కనిగిరి నియోజకవర్గంలో 15 ఆలయాలకు సుమారు మూడు వేల ఎకరాల భూములున్నాయి. వాటిలో కనిగిరి, పామూరు, సీఎస్‌పురం, పీసీపల్లి మండలాల్లోని సుమారు 700 ఎకరాల వరకు ఆక్రమణలో ఉన్నాయి.

 ఆన్‌లైన్‌లో వెలుగు చూడనవి ఎన్నో..
భూముల వివరాలన్నీ ఆన్‌లైన్ చేయూలన్న దేవాదాయశాఖ మంత్రి ఆదే శాలు అమలుకు నోచుకోలేదు. అన్యాక్రాంత భూములు ఆన్‌లైన్‌లో కన్పించడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ఆక్రమణదారులు, అధికారుల లాలూచిలతో చాలా వరకు భూములు రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి.

 కబ్జా చేసి.. ప్లాట్లుగా మార్చి..
పామూరులో వేణుగోపాలస్వామి, శ్రీవల్లి భుజంగేశ్వరస్వామి ఆలయ భూములు సుమారు 35 ఎకరాల వరకు ఆక్రమించి ప్లాట్లు  వేసి అమ్ముకున్నారు. సీఎస్‌పురంలోని తిరుమలనాధుని ఆలయ భూములు 100 ఎకరాలు కబ్జాకు గురికాగా, కనిగిరిలోని శంఖవరం. పీసీపల్లిలోని శివాలయ, భద్రాచలం రామాలయ భూములు ఆక్రమణలో ఉన్నాయి. జిల్లాలోని మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవస్వామి, రాచర్ల ఉమామహేశ్వర, పొన్నలూరు దుర్గ మల్లేశ్వర, కందుకూరు జనార్దన, గిద్దలూరు ఆంజనేయస్వామి దేవస్థానాల భూములు కూడా కొంత అక్రమణలో ఉన్నట్లు సమాచారం. 

 మార్తాండుని భూములు హాంఫట్..
కనిగిరిలోని విజయమార్తాండేశ్వర స్వామి భూములు వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. కోట్ల విలువ చేసే ఆస్తులన్నా.. సరైన ఆదరణ లేదు. నెల్లూరు, జలదంకి, కావలి, ఉదయగిరి, అల్లూరు, సోమేశ్వరం ప్రాంతాల్లో వీటి భూములున్నాయి. విచిత్రమేమంటే వీటికి సంబంధించిన సుమారు 100 ఎకరాల భూములు ఎక్కడున్నాయో.. అధికారులకే తెలియదు. కనిగిరి మండలంలో అయ్యన్నపాలెంలో సర్వే నం:  8, 9, 10, 15, 20, 23, 28 లలోని సుమారు 100 ఎకరాలు మాన్యం భూమి రికార్డుల్లో కన్పించడం లేదు. నెల్లూరు జిల్లా జలదంకి లో సుమారు 100 ఎకరాలు భూమిని దర్జాగా అక్రమార్కులు సాగు చేసుకుంటున్నారు. చాకిరాల శివాలయానికి చెందిన167 ఎరకాలు భూమి చాకిరాల, తుమ్మగుంట, హజీస్‌పురం, పద్మాపురం గ్రామాల్లో ఉంది. ఏళ్ల కాలం నుంచి కొంత భూమి కౌలు చెల్లించకుండా అక్రమ సాగుచేస్తున్నారు. ఇదంతా దేవాదాయ శాఖ అధికారులకు తెలియకుండా జరుగుతుందనుకుంటే పొరబాటే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement