temple lands
-
ఆలయ భూముల్లోని పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు: మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: కబ్జాల్లో ఉన్న దేవాలయ భూములను స్వా«దీనం చేసుకునే క్రమంలో ఆ భూ ముల ఆక్రమణలో ఉన్న పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆలయాల భూములు స్వాధీనం చేసుకుని దేవుడి పేరుతో పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఆమె సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే 34,092 ఎకరాల ఆలయ భూముల జియోట్యాగింగ్ ప్రక్రియ పూర్తయిందని, రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ఆలయ భూముల హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఎకో–టెంపుల్ టూరిజం.. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న అటవీ భూముల్లో సుందర ప్రాంతాలను గుర్తించి పర్యాటకులను ఆకట్టుకునేలా ఎకో టూరిజం ప్రాజెక్టును చేపడుతున్నట్టు మంత్రి సురేఖ తెలిపారు. అలాగే దీనిని ఇప్పుడు ఆధ్యాత్మికతకు జోడించి ఆయా ప్రాంతాల్లోని ఆలయాలను అద్భుత పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. దేవాలయాల్లో ఫిర్యాదుల పుస్తకం.. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఫిర్యాదులు నమోదు చేసేందుకు పుస్తకాలను ఏర్పాటు చేస్తామని, వాటిల్లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా పరిష్కార చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వేములవాడ దేవాలయ గోపురానికి కూడా స్వర్ణ తాపడం చేయిస్తామని, ఇందుకు 65 కిలోల ఆలయ బంగారాన్ని వాడతామని ఆమె చెప్పారు. ఆలయంలోని వెండితో పల్లకీ చేయిస్తామన్నారు. అలాగే బాసర దేవాలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంతో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్లు పాల్గొన్నారు. -
AP: దేవుడి భూములకు ఎసరు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల సమీపంలో కోట్ల రూపాయల విలువైన దేవుడి భూములను కొంత మంది ప్రైవేట్ హోటల్ వ్యాపారులకు కట్టబెట్టే ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని 20 రోజుల క్రితం గత నెల 27వ తేదీన దేవదాయ శాఖ మంత్రి, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు.ఒక్కో చోట రెండేసి చొప్పున ప్రముఖ హోటల్ యజమానుల ఆధ్వర్యంలో హోటల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం మినిట్స్ పాయింట్స్‌ను వారం రోజుల కిత్రమే దేవదాయ శాఖ కమిషనర్ శాఖ అధికారులకు తెలియజేస్తూ మెమో కూడా జారీ చేశారు. విజయవాడ దుర్గ గుడి వంటి ఒకటీ అరా తప్ప.. రాష్ట్రంలో పెద్ద ఆలయాలు అన్నింటి వద్ద దైవ దర్శనాలకు వచ్చే భక్తుల వసతి సౌకర్యాల కోసం ఆలయ వసతి గదులు అందుబాటులో ఉన్నాయి. చాలా చోట్ల అన్ని రకాల వసతులతో కూడిన ఏసీ గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు.. ఆలయాల వద్ద ప్రముఖ ప్రైవేట్ హోటల్స్ నిర్మాణం ప్రతిపాదనలను సీఎం ఎందుకు తీసుకొచ్చారన్నది తమకు అర్థం కాలేదని కొందరు దేవదాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, వాటి చుట్టు పక్కల మొత్తం 2.11 కోట్ల చదరపు గజాల (4,355 ఎకరాలు) విస్తీర్ణంలో వేల కోట్ల విలువ చేసే భూములు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆలయం చుట్టు పక్కల అంటే వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయని.. దీనికి తోడు ఆలయాలకు ఆత్యంత సమీపంలోనే పెద్ద విస్తీర్ణంలో ఖాళీ స్థలాలు ఉండడంతో ప్రముఖ హోటల్స్ యజమానులు ఆయా ప్రాంతాల్లో కొత్త హోటల్స్ నిర్మాణానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో హోటల్స్ నిర్మాణం పేరుతో విలువైన భూముల దోపిడీకి అస్కారం ఉంటుందని అంటున్నారు.గతంలోనూ ఇంతే..2014–19 మధ్య కూడా రాష్ట్రంలో పలుచోట్ల దేవుడి భూములను అమ్మేందుకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇదే తరహా డైవర్షన్ రాజకీయాలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అప్పట్లో విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధుల కోసం అంటూ విశాఖపట్నం చుట్టు పక్కల ఉన్న విలువైన దేవదాయ శాఖ భూముల అమ్మకానికి 2014లో అప్పటి టీడీపీ–బీజేపీ ప్రభుత్వం మాన్సాస్ ట్రస్టుకు ఆదేశాలిచ్చింది. రూ.వంద కోట్ల మేర భూములు కూడా విక్రయించింది. ఇంతా చేసినా, అప్పట్లో విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి కనీసం పత్రిపాదనలు కూడ సిద్ధం చేయలేదు. మరోవైపు.. ఉమ్మడి గుంటూరు జిల్లా అమరావతి మండల కేంద్రంలోని సదావర్తి సత్రం పేరిట తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని భూములను తక్కువ ధరకే కొందరు టీడీపీ నాయకులకు కట్టబెట్టే యత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్లో ఈ అంశంపై వైఎస్సార్సీపీ నాయకులు న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ భూములు రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కూడ కారణమయ్యాయి.దేవుడి బ్యాంకు డిపాజిట్లపై కన్నుకేవలం పట్టణ ప్రాంతాల్లోనే వివిధ ఆలయాలు, వివిధ రకాల దేవదాయ, ధర్మదాయ ధార్మిక సంస్థ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల చదరపు గజాల (3,203 ఎకరాల) భూములున్నాయి. అత్యధిక చోట్ల గజం భూమి విలువ రూ.20 వేలకు తక్కువ కాకుండా, కొన్ని చోట్ల లక్ష రూపాయల దాకా కూడా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి భూముల వినియోగంపై తగిన ప్రతిపాదనలు కోరడంతో పాటు.. వివిధ ఆలయాల పేరిట బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, వాటి వడ్డీ రేట్ల వివరాలు సైతం సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆలయాల డిపాజిట్ల వివరాలు కోరడం వెనుక కారణమేంటన్నది ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే.. -
స్వామి భూములు స్వాహా!
గంట్యాడ: దేవుడికే టీడీపీ నాయకులు శఠగోపం పెట్టేశారు. దేవుడి భూములను ఆక్రమించి ఫలసాయం పొందడంతో పాటు వాటి విక్రయాలకు తెగబడుతున్నారు. ఈ విషయం దేవదాయశాఖ అధికారులకు తెలిసినా ప్రేక్షకపాత్రకే పరిమితమవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయానికి అదే జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో 48 ఎకరాల భూమి ఉంది.విజయనగరంలోని హుకుంపేటకు చెందిన అనసపురపు జగన్నాథరావు తండ్రి రామమూర్తి పంతులు, అనసపురపు జగన్నాథ రాజగోపాలరావు తండ్రి శ్రీనివాస పంతులు శ్రీమన్నార్ రాజగోపాలస్వామివారి ధూప, దీప నైవేద్యాలు, జాతర నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం 1929లో 48 ఎకరాల భూమిని రిజిస్టర్ చేశారు.డాక్యుమెంటేషన్ 1815 పేరిట 32 ఎకరాల పల్లపు భూమి, 16 ఎకరాల మెట్ట భూమిని అప్పగించారు. ఈ భూమి సర్వే నెంబర్ 95/15, 16, 17, 19, 21, 96/1, 3, 4, 97/20, 21, 23, 99/9, 10, 11, 12, 14, 15, 100/4, 5, 8, 9, 10, 140/3, 4, 9, 11, 12, 14 తదితర నంబర్లలో విస్తరించి ఉంది. దీని విలువ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంటుందన్నది స్థానికుల మాట. దీనిపై టీడీపీ నేతల కన్నుపడింది. అంతే.. మొత్తం భూమిని తమ గుప్పెట్లోకి లాక్కున్నారు. ఏళ్ల తరబడి అనుభవించడంతో పాటు ఇప్పుడు అధికార బలంతో విక్రయాలకు సిద్ధపడ్డారు. కొందరైతే అందులో అక్రమ కట్టడాలు సైతం తలపెట్టారు. ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖాధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు.. శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయానికి చెందిన 48 ఎకరాల భూమి సిరిపురం గ్రామ పరిసరాల్లో ఉంది. ఈ భూములన్నీ ఆలయానికి చెందినవే. పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయి. శ్రీమన్నార్ రాజగోపాలస్వామి దేవస్థానానికి చెందిన భూములన్నీ మ్యానిíసిప్ట్ డయాగ్లేట్ రిజిస్టర్ (ఎండీఆర్)లో దేవస్థానం భూములుగా నమోదై ఉన్నాయి. ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిలిపివేశాం. అక్రమ రిజి్రస్టేషన్లు చెల్లవు. కొనుగోలు చేసేవారే బాధ్యులవుతారు. – శ్రీనివాస్, వీఆర్వో, సిరిపురం -
ఇక గుడి భూములకు పక్కా లెక్క!
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల భూములన్నింటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేస్తోంది. ఆలయం వారీగా ఏ గ్రామంలో, ఏ సర్వే నంబరులో, ఎంతెంత భూమి ఉంది, తదితర వివరాలను పక్కాగా ఆన్లైన్లో నమోదు చేస్తోంది. దీని ద్వారా అన్ని ఆలయాల వివరాలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 24,669 వరకు ఆలయాలు, సత్రాలు, మఠాలు, ట్రస్టులు ఉన్నాయి. వీటి భూముల వివరాలు ఆలయం లేదా సంస్థల వద్ద ‘43 నెంబరు’ రిజిస్టర్ పేరుతో ఉండే ప్రత్యేక రికార్డుల్లో మాత్రమే ఉండేవి. ఇటీవల కొన్ని చోట్ల రికార్డుల్లో భూముల వివరాలను ఉండే పేజీలను ప్రత్యేకంగా స్కాన్ చేసి, వాటిని మాత్రం ఆన్లైన్లో పొందుపరిచారు. దేవదాయ శాఖ కమిషనర్ సహా అధికారులకు ఏదైనా సమాచారం కావాలంటే జిల్లా లేదా ఆలయాల ఈవో నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ఏళ్ల తరబడి ఆలస్యం కావడంతోపాటు పారదర్శకత లోపించి, పలు చోట్ల ఆలయాల భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దేవుడి భూముల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, శాఖలోని కీలక అధికారులకు ఆలయాల వారీగా భూముల వివరాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా కంప్యూటరీకరణకు చర్యలు చేపట్టింది. గత నెల రోజులుగా ఈవో స్థాయిలో ఆలయాల భూముల వివరాలు ప్రత్యేక ఫార్మాట్లో అన్లైన్లో నమోదు చేశారు. మాగాణి లేదా మెట్ట లేదా కొండ ప్రాంతం లేదా ఖాళీ స్థలం లేదా చెరువు తదితర కేటగిరితో సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఈవో స్థాయిలో నమోదు కార్యక్రమాన్ని నిలిపివేశారు. వీటిలో మార్పులు చేసే అధికారం ఇకపై ఈవోలకు ఉండదు. ఇంకా ఎక్కడన్నా ఏ ఆలయం వివరాలు ఏవైనా మిగిలిపోతే వాటిని నమోదు చేసే అవకాశం దేవదాయ శాఖ జిల్లా అధికారులకు మాత్రమే కల్పించారు. ఈ ప్రక్రియను కూడా ముగించి.. ఆగస్టు మొదటి వారంలో రికార్డులను సరిపోల్చుకునే ప్రక్రియ చేపడతారు. వారం రోజుల్లో దీనిని పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల్లో మార్పులకు వీలు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో ఆలయాల భూముల వివరాల్లో మార్పులు చేయాలంటే జిల్లా అధికారులు, ఈవోలు ముందుగా దేవదాయ శాఖ కమిషనర్‌కు స్పష్టమైన కారణాలను తెలియజేసి, ఆయన అనుమతి పొందాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఫార్మాసిటీ కోసం ఆలయ భూములా?
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాల ఆలయ భూముల సేకరణను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. దేవాదాయ శాఖ భూములను సాగునీటి ప్రాజెక్టుల కోసమే సేకరించాలని గతంలోనే ద్విసభ్య ధర్మాసనం చెప్పిందని, ఇతర అవసరాల కోసం కాదని స్పష్టంచేసింది. భూ సేకరణ, రెవెన్యూ అధికారులకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల సంస్థ (టీఎస్ఐఐసీ) పిటిషన్ ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సిన దేవాదాయ భూ సేకరణపై సింగిల్ జడ్జిని ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. రంగారెడ్డి జిల్లా నందివనపర్తి, సింగారంలో ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూ సేకరణపై యథాతథస్థితి విధించింది. నీటి ప్రాజెక్టులకు కాకుండా ఇతర ప్రజావసరాలకు ఆలయ భూములు సేకరించవచ్చన్న నిబంధనలు ఏవైనా ఉంటే.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ఐఐసీ ఎండీ, రెవెన్యూ–దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ ఈవోకు నోటీసులు జారీ చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు భూ సేకరణపై ముందుకెళ్లరాదని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. దేవాదాయ భూముల సేకరణకు హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో నందివనపర్తి, సింగారం పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూముల సేకరణ కోసం టీఎస్ఐఐసీ గత నవంబర్‌లో హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. భూ సేకరణకు అనుమతి ఇస్తూ అదే నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ చట్ట ప్రకారం భూమిని సేకరించాలని, ఆ వచ్చిన మొత్తం నగదును ఓంకారేశ్వర స్వామి ఆలయ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. సదరు మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సింగిల్ జడ్జి చెప్పారు. ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన భక్తులు మోతెకాని జంగయ్య, కుర్మిడ్డకు చెందిన దేవోజీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆలయ భూముల సేకరణకు ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి అని.. సింగిల్ జడ్జిని ఆశ్రయించి ఉత్తర్వులు పొందడం చెల్లదన్నారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రమే ఆలయ భూములు సేకరించాలని గతంలో డివిజన్ బెంచ్ పేర్కొందన్నారు. భూసేకరణతో ఎలాంటి సంబంధం లేని టీఎస్ఐఐసీ పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఆపాలని కోరారు. ఇతర అవసరాలకు సేకరించవచ్చు... ఇతర ప్రజావసరాలకు కూడా దేవాదాయ భూములను సేకరించవచ్చని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో దీనికి సంబంధించి పలు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. అయితే వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని కోరారు. భూములు ఇచ్చేందుకు ఓంకారేశ్వర ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అంగీకరించాయని చెప్పారు. ఇందులో ఇతరులకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. -
స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ రామచంద్రస్వామి ఆలయ భూములు దేవాదాయ శాఖవేనని విచారణ కమిటీ నిగ్గుతేల్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో వెలుగుచూసిన ఈ భూముల వ్యవహారంపై నిగ్గు తేల్చాలని నిర్ణయించిన సర్కారు.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆలయ భూముల్లో వాణిజ్య నిర్మాణాలు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, పరిశ్రమలు పుట్టుకొచ్చినట్లు గుర్తించింది. అలాగే, కొంతమంది సాగు కూడా చేసుకుంటున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించి 1,350 ఎకరాలు దేవాదాయశాఖకే చెందుతాయని కమిటీ తేల్చింది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ భూముల్లో తిష్టవేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీతారామస్వామి... సీతారామరెడ్డి అయ్యాడు! దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం చాలా పురాతనమైనది. నిజాం హయాంలో ఓ భక్తుడు ఈ ఆలయానికి 1,531 ఎకరాల భూమిని వితరణ చేశారు. దానిని ఆలయ భూమిగా రికార్డుల్లో చేర్చారు. ఇప్పటివరకు కచ్చితమైన భూరికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూ రికార్డుల్లో.. ఈ 1,531 ఎకరాల భూమి సీతారామచంద్రస్వామి ఆలయం పేరిటే ఉంది. ఈ భూములన్నీ 55 నుంచి 63, 639–641, 656, 657, 660–682, 686–718, 736 సర్వే నంబర్లలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ తర్వాత ఆ భూమి కబ్జాల పాలైంది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం పేరు కాస్తా.. సీతారామరెడ్డి, సీతారామారావు, సీతారామయ్య, సీతారాములుగా.. మారిపోయి కబ్జాదారుల పేర్లు రికార్డులకెక్కాయి. ఆ భూముల్లో రిసార్టులు, పరిశ్రమలు, నివాసాలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. రికార్డులు స్పష్టంగా ఉన్నా... ఆ భూముల్లోనే 130 ఎకరాల్లో హకీంపేట ఎయిర్‌బేస్ ఉంది. మరో 800 ఎకరాల భూమి వ్యవసాయం పేరుతో ఖాళీగా ఉంది. మరి వాటి రూపంలో రావాల్సిన ఆదాయం ఎటుపోతోంది? ఎవరి జేబుల్లోకి వెళుతోంది? అసలా భూములన్నీ దేవుడి మాన్యమేనని పాత రెవెన్యూ రికార్డులు స్పష్టంగా చెబుతున్నా ఇన్ని నిర్మాణాలు ఎలా వెలిశాయి? వీటన్నింటికీ జవాబు ఒకటే... పలువురు నేతలు, అధికారులు కుమ్మక్కై దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు. ఈ భూములను తమ అధీనంలో ఉంచుకున్న వారు ప్రతినెలా రూ.5 కోట్ల మేర అద్దె/లీజు పేరిట వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అక్రమార్కులకు క్లీన్చిట్.. పదోన్నతులు ఈ భూములను ’కబ్జా’లో ఉన్నవారికే ఇచ్చి డబ్బులు వసూలు చేయాలంటూ కొంతకాలం కింద దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ, దీనిపై నియమించిన జస్టిస్ వెంకటరామిరెడ్డి కమిషన్ ఈ వ్యవహారంలో అక్రమాలను నిగ్గుతేల్చి.. ఆలయ మేనేజర్ చంద్రమోహన్, సహాయ కమిషనర్ రాఘవాచార్యులు, మాజీ డిప్యూటీ కమిషనర్ జ్యోతిపై చర్యలు తీసుకోవాలని నివే దికలో పేర్కొంది. విజిలెన్స్, ఏసీబీ కూడా వీరితోపాటు నాటి దేవాదాయ కమిషనర్ వెంకటేశ్వర్లు, ముఖ్యకార్యదర్శి జేపీ మూర్తి, సంయుక్త కమిషనర్ రామకృష్ణకుమార్, ఉపకమిషనర్ మోహనాచారిని కూడా బాధ్యులను చేస్తూ చర్యలకు సిఫారసు చేశాయి. కానీ, అప్పటి ప్రభుత్వం వారికి క్లీన్చిట్ ఇచ్చింది. ఆపై పదోన్నతులు కూడా కల్పించిందన్న ఆరోపణలున్నాయి. కాగా, హైదరాబాద్ శివారులోని ఈ 1,350 ఎక రాలు దేవాదాయ శాఖవేనని కమిటీ తేల్చ డంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌సహా వారి బంధువుల భూములు ఉన్నాయన్న నేపధ్యంలో కక్ష సాధింపునకే ప్రభుత్వం విచారణ చేపట్టిందని పలువురు విమర్శించారు. -
వచ్చే నెలాఖరుకు శ్రీశైల దేవస్థానం సరిహద్దులు
సాక్షి, అమరావతి: శ్రీశైలం దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరుకల్లా ఖరారు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు భూ సరిహద్దులు సక్రమంగా లేకపోవడం ఆటంకంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుతో కలిసి సమీక్ష నిర్వహించామన్నారు. అటవీ, రెవెన్యూ, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్, దేవదాయ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో భూ సర్వే చేపడతామన్నారు. 1879లో దాదాపు 4,130 ఎకరాలుండగా.. 1967లో మరో 145 ఎకరాలను ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి కేటాయించిందన్నారు. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఈ భూములు ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే సరిహద్దుల ఖరారు తప్పనిసరైందన్నారు. రిజర్వ్ ఫారెస్టు నిబంధనలను అతిక్రమించకుండా దేవస్థానానికి చెందిన భూముల్లో పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. కాగా, బెజవాడ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉప ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ పాల్గొన్నారు. -
ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవుడి భూములు ఆక్రమణలకు గురైనచోట సమర్థంగా కోర్టుల్లో కేసులు ఫైల్ చేయడంతోపాటు కోర్టుల్లో కేసులున్న చోట సకాలంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు నలుగురు రిటైర్డు జడ్జిలనుగానీ, సీనియర్ న్యాయ వాదులనుగానీ నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. గొల్లపూడిలోని దేవదాయశాఖ కమిష నర్ కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికా రులు, అన్ని జిల్లాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కమిషనర్ హరిజవహర్‌లాల్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలయ ఆస్తుల్ని కాపాడేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గతంలో దేవుడి భూముల అంశంలో దేవదాయ శాఖకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చినా పైకోర్టులకు అప్పీలుకు వెళ్లని వాటి విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి ఆ భూములను దేవుడి ఆధీనంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. తొమ్మిదిమంది స్టాండింగ్ కౌన్సిళ్లను నియ మించమని అడ్వొకేట్ జన రల్కు లేఖ రాసినట్టు తెలి పారు. కోర్టుల్లో కౌంటర్ల దాఖలు అంశంలో అక్టో బర్లోపు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. కొత్తగా 2,699 ఆలయాలకు ధూపదీపనైవేద్యం పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించామని, ఇప్పటికే 718 ఆలయాలకు మంజూరు చేశా మని, 1,981 ఆలయాలకు మంజూరు చేయబోతున్నామని చెప్పారు. ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు న్యాయం చేసేలా త్వరలో ప్రకటన చేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్ కాలేజీని విద్యాశాఖకు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతి మంగళవారం శాఖాపరమైన అంశాలపై సమీక్షిస్తానన్నారు. దసరా ఉత్సవాలు జరిగే ఆలయాల ఈవోలతో ఈ నెల 30న మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. నాయీ బ్రాహ్మణ నేతల వినతిపత్రం ఆలయాల్లోని కేశఖండనశాలలో పనిచేసే నాయీ బ్రాహ్మణులు కొందరు పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అధికారులతో సమీక్ష అనంతరం తిరిగి వెళుతున్న ఆయన కారుకు అడ్డంగా కూర్చుని తమ సమస్యలపై ఇప్పటికిప్పుడే ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలోని సంస్థలకే దేవదాయ లీజులు
సాక్షి, అమరావతి: వ్యవసాయేతర భూములు మినహా దేవదాయ శాఖ పరిధిలో జరిగే లీజు ఒప్పందాలకు రాష్ట్ర పరిధిలో రిజిస్టర్ చేసుకున్న సంస్థలకే ప్రాధాన్యత ఇచ్చేలా లీజు నిబంధనలు మారుస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ అంశంపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల పాటు అవకాశం కల్పించినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధన అమలులోకి వస్తే.. రాష్ట్ర పరిధిలోని ఆలయాల్లో ఎలాంటి లీజు ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా మన రాష్ట్రంలోనే ట్యాక్స్ చెల్లించేలా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవతో పూజరి శైలజకు న్యాయం -
ఆలయ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట
దేవుడి భూమిని లీజుకు తీసుకున్న కౌలుదారుడు గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకుంటే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అధికారులు ముందుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేయాలి. అక్కడి నుంచి అనుమతి పొందాకే చర్యలు చేపట్టాలి. ఈలోపు ఆక్రమణదారులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటే ఇక అది అంతులేని కథే! రూ.వందల కోట్ల విలువ చేసే ఆలయాల స్థలాలతో పాటు అనుబంధంగా ఉండే షాపుల లీజు వ్యవహారం కూడా ఇంతే. రాష్ట్రవ్యాప్తంగా 1,05,364 ఎకరాలు ఆక్రమణదారుల చెరలో చిక్కుకున్నట్లు అంచనా. ఇకపై ఇలాంటి వ్యవహారాలకు తెరదించేలా దేవదాయ శాఖ చట్ట సవరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షి, అమరావతి: దేవుడి భూముల అక్రమణలకు శాశ్వతంగా తెరదించేలా దేవదాయ శాఖ చట్టంలో పలు సవరణలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. లీజు గడువు ముగిసిన తర్వాత కూడా దేవుడి భూములను ఖాళీ చేయకుండా అక్రమంగా కొనసాగుతున్న వారికి ఒకే ఒక్క నోటీసు ఇచ్చి వారం రోజుల్లోగా తిరిగి స్వాధీనం చేసుకునేలా దేవదాయ శాఖ చట్టం నిబంధనలు సవరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్డినెన్స్ లేదా అసెంబ్లీలో చట్ట సవరణ ప్రక్రియ పూర్తయితే కేవలం నోటీసుల జారీ ద్వారానే 17,839 ఎకరాల దేవుడి భూములను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణదారుల చెరలో దాదాపు 1.05 లక్షల ఎకరాల దేవుడి భూములు ఉండగా 17,839 ఎకరాలకు సంబంధించి నాలుగైదు ఏళ్ల క్రితమే గడువు ముగిసినా ఖాళీ చేయకుండా పాత లీజుదారులే కొనసాగుతున్నట్లు దేవదాయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. కోర్టు స్టే లాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఆక్రమణదారుల చెరలో ఉన్న ఇలాంటి భూములను కొత్త సవరణ చట్టం ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే వీలుంటుందని అధికారులు వివరించారు. ఆర్టీసీ, రైల్వే లీజుల్లో ఇప్పటికే.. లీజు గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకుండా కొనసాగుతుంటే కేవలం అధికారుల స్థాయిలోనే నోటీసులిచ్చి స్వాధీనం చేసుకునే విధానం రైల్వే, ఆర్టీసీలో ఇప్పటికే అమలులో ఉంది. దేవదాయ శాఖ భూములు, స్థలాలు, షాపుల విషయంలో ట్రిబ్యునల్‌ను కూడా సంప్రదించాలన్న నిబంధన కారణంగా అక్రమ అనుభవదారుల సంఖ్య పెరిగినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీసీ, రైల్వే తరహాలో నిబంధనలు తేవడం ద్వారా దీన్ని అరికట్టవచ్చని తెలిపాయి. సీజీఎఫ్ నిధులకు ఆదాయ పరిమితి పెంపు! శిధిలావస్థకు చేరుకున్న పురాతన, పాత ఆలయాల పునఃనిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ప్రస్తుతం ఉన్న ఆలయాల గరిష్ట ఆదాయ పరిమితిని పెంచుతూ చట్ట సవరణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
అన్యాక్రాంతమైన ఆలయ భూములపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో అన్యాక్రాంతమైన దేవదాయశాఖకు చెందిన భూములను తిరిగి రాబట్టే విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. జిల్లాల పునర్విభజన అనంతర పరిస్థితులపై అన్ని జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు బుధవారం తాడేపల్లిలోని దేవదాయ శాఖ ట్రైనింగ్ కేంద్రంలో ఒక్క రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. దేవదాయ శాఖకు రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని, వాటిలో 1.05 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు చెప్పారు. ఈ భూములకు సంబంధించి మూడు వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ కేసుల విషయంలో ఆక్రమణదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని కోర్టుల ముందుంచాలన్నారు. భూముల విషయంలో కోర్టు కేసుల ప్రగతి ఎలా ఉందనే విషయంపై ప్రతి మూడు నెలలకోసారి, రాష్ట్రంలో ఆలయాల పరిస్థితిపై ప్రతి శుక్రవారం సమీక్ష నిర్వహిస్తామని మంత్రి వివరించారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండే దేవదాయ శాఖపై లేని పోని అబద్ధాలతో బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కాచుకుకూర్చున్నాయని, ఏ చిన్న పొరపాట్లకూ తావివ్వకుండా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్లలో నీడ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కమిషనర్ హరిజవహర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
దేవుడి నగల వివరాల డిజిటలీకరణ
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించి దేవుడి నగల వివరాలన్నిటినీ డిజటలీకరణ చేయాలని దేవదాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. దేవుడికి సంబంధించిన బంగారు, వెండి నగలను అన్నివైపుల నుంచి ఫొటోలు తీసి, ఆ నగ బరువు వివరాలతో సహా కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన గొల్లపూడిలోని కమిషనర్ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ వాణీమోహన్, ఆర్జేసీలు, డిప్యూటీ కమిషనర్లు, జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, ప్రధాన ఆలయాల ఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయాల్లో ఎటువంటి అవకతవకలకు అవకాశాలు లేకుండా పూర్తి పారదర్శక విధానాలను అమల్లోకి తెచ్చేందుకు.. దేవుడి నగలతో పాటు ఆలయ భూములు, ఇతర ఆస్తులు, లీజుల వివరాలతోపాటు ఆలయాలకు ఏటా ఏ రూపంలో ఎంత ఆదాయం వస్తోంది, ఎంత మొత్తం ఖర్చవుతోంది, బ్యాంకులలో డిపాజిట్లు ఏ మేరకు ఉన్నాయనే వివరాలను ఆలయాల వారీగా నిర్వహించే 6 రకాల రిజిస్టర్లను కూడా కంప్యూటరీకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆయా ఆలయాల్లో వెంటనే చేపట్టాలని మంత్రి వెలంపల్లి, వాణీమోహన్ సూచించారు. జమా ఖర్చులపై విధిగా ఆడిట్ జమా ఖర్చులకు సంబంధించి ఆలయాల వారీగా ఏటా ఆడిట్ జరిపించాలని మంత్రి వెలంపల్లి ఆదేశించారు. దశలవారీగా పూర్తిస్థాయిలో క్యాష్ లెస్ విధానం అమలు చేయాలన్నారు. దేవుడి భూములు, షాపులు, ఇతర లీజులకు సంబంధించి ఎటువంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు వసూలు చేయాలని సూచించారు. ఆలయాల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రైవేట్ ఆలయాలపై దాడులు జరిగినా దేవదాయ శాఖ స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తుందని హెచ్చరించారు. -
Supreme Court of India: ఆలయ భూహక్కులు దేవుడివే
న్యూఢిల్లీ: దేవాలయ భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులన్నీ ఆలయంలోని దేవుడికే చెందుతాయని, పూజారి ఎప్పటికీ భూస్వామి కాలేడని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దేవాలయ ఆస్తులుగా ఉన్న భూముల నిర్వహణ మాత్రమే పూజారిదని, భూములన్నీ ఆలయంలోని దేవుడికే చెందుతాయని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. భూమి హక్కులకు సంబంధించిన పత్రాలలో యజమాని అన్న కాలమ్‌లో ఆ ఆలయంలో కొలువు తీరిన దేవుడి పేరు రాయాలని, చట్టపరంగా దేవుడికే ఆ భూమిపై హక్కులుంటాయని న్యాయమూర్తులు చెప్పారు. పూజారులు, దేవస్థానంలో ఇతర సిబ్బంది ఆ దేవతామూర్తి తరఫునే పనులు నిర్వహిస్తారని, పూజారి ఎన్నటికీ కౌలుదారుడు కాలేడని భూ చట్టాలలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో దేవాలయ భూముల్ని పూజారులు అక్రమంగా అమ్ముకోవడాన్ని నిరోధిస్తూ రెవెన్యూ రికార్డుల నుంచి పూజారి పేరుని తొలగిస్తూ అక్కడి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్లను హైకోర్టు కొట్టివేయడంతో దానిని సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కింది. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం బెంచ్ దేవాలయ భూముల నిర్వహణ, పరిరక్షణ మాత్రమే పూజారి విధి అని ఒకవేళ తన విధుల్ని నిర్వర్తించడంలో విఫలమైతే మరొకరికి అప్పగించే అవకాశాలు ఉండడం వల్ల ఆయనను భూస్వామిగా చెప్పలేమంది. రెవెన్యూ రికార్డుల్లో పూజారి, మేనేజర్ల పేర్లు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
వీళ్లు మహాముదుర్లు, స్వామికే.. శఠగోపం పెట్టారుగా!
చింతపల్లి(నల్లగొండ): విలువైన దేవుని మాన్యం అన్యాక్రాంతమవుతోంది. దేవాదాయ శాఖ పర్యవేక్షణ లోపం, పూజారుల ఇష్టారాజ్యం వల్ల చింతపల్లి మండల కేంద్రంలోని గట్టుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి భూములలు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ రికార్డుల్లో 110 ఎకరాలు ఉండగా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 70 ఎకరాలను మాత్రమే అధికారికంగా లెక్క చూపిస్తుండడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎంతో చరిత్ర కలిగిన ఆలయం హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారికి కేవలం వంద మీటర్ల దూరంలో గట్టుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. 600 సంవత్సరాల క్రితం ఇక్కడ వేంకటేశ్వరస్వామి వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం ఆధీనంలో 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరం రూ.1.50 కోట్లు పలుకుతుంది. విలువైన భూములు కావడంతో కొందరు అక్రమార్కులు హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రికార్డులను తారుమారు చేస్తూ తప్పుడు లెక్కలతో దేవాలయ భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలుస్తోంది. ఆలయానికి దేవరకొండ, గోకారం, గడియగౌరారం గ్రామాల్లో కూడా ఈ దేవాలయానికి సంబంధించి భూములు ఉన్నాయి. అవి కూడా ఎక్కడా రికార్డుల్లో లేని పరిస్థితి. పూజారుల ఆధీనంలో.. గట్టుపతి దేవాలయం భూములు ఇక్కడి 80 ఏళ్ల నుంచి పూజారుల ఆధీనంలో ఉన్నాయి. అసలు దేవాదాయ శాఖ కమిటీ ఆధీనంలో దేవాలయ ఈ భూములు ఉండాలి. దానిపై కమిటీ సభ్యుల పర్యవేక్షణ ఉంటుంది. భూములకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రత్యేకంగా రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ భూములు కౌలు వేలం వేసి దేవాలయ నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కానీ వేలంపాట నిర్వహించకుండానే విలువైన భూములు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ఇప్పటివరకు సుమారు 40 ఎకరాల వరకు భూములు మాయమైనట్లు తెలుస్తోంది. 40 ఎకరాల లెక్క తేల్చని రికార్డులు గట్టుపతి దేవాలయ భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ రికార్డులో 110 ఎకరాలకు బదులుగా 70 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తుండగా.. మిగతా 40 ఎకరాల ప్రస్తావన ఎక్కడా చూకపోవడం ఇటు దేవాదాయ శాఖ అధికారులు అటు రెవెన్యూ అధికారుల ఉదాసీనతకు అద్దంపడుతోంది. సంబంధిత అధికారులు స్పందించి భూముల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విష యం తమ దృష్టికి వచ్చింది. భూముల విలువలు పెరగడంతో అక్రమార్కులు దేవాదాయ భూములను ఆక్రమిస్తున్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. భూముల వేలంపాటకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. – సత్యనారాయణమూర్తి, దేవాదాయ శాఖ ఈఓ చదవండి: Hyderabad Collector L Sharman: బైక్‌పై వెళ్లి.. తనిఖీలు చేసి.. -
ఆలయాల ఆస్తులపై నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములు, ఇతర ఆస్తులను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఈవోలను దేవదాయ శాఖ హెచ్చరించింది. దేవుడి ఆస్తులను కాపాడటంలో ఉదాశీనత, జమా ఖర్చుల్లో అవకతవకలు లాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ స్పష్టం చేశారు. భూములను ఆక్రమించుకోవడం, లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకపోవడం లాంటి వాటిపై ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆమె అన్ని ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ► భూములు, షాపుల లీజు గడువు ముగియడానికి మూడు నెలల ముందే బహిరంగ వేలం నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదు. ఏడాది లీజు మొత్తాన్ని అడ్వాన్స్‌గా వసూలు చేయాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 75 శాతానికి మించి బిల్లులు చెల్లించరాదు. ► ఔట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. రూ.కోటికిపైగా విలువైన టెండర్లకు ఆరు నెలల వ్యవధికే ఒప్పందాలు చేసుకోవాలి. ► దేవాలయాల్లో అన్నదానం, ప్రసాదం పంపిణీకి ఒకే తరహా ‘దిట్టం’ విధానాన్ని అమలు చేస్తారు. అన్నదానం హాళ్లు, కిచెన్, సరుకుల గదుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ► ఆలయాల్లో ఖర్చులకు నగదుగా కాకుండా చెక్కుల రూపంలోనే చెల్లింపులు చేయాలి. ► ఆలయాల క్యాష్ బుక్‌లో పెన్నుతో కాకుండా పెన్సిల్‌తో జమా ఖర్చులు రాయడం, రశీదులు చూపకపోవడం లాంటి వాటిని గుర్తిస్తే ఈవో అవినీతికి పాల్పడినట్టు పరిగణిస్తారు. -
భూ అక్రమాల బాధ్యులపై కఠిన చర్యలు
సాక్షి, విశాఖపట్నం: మాన్సాస్ ట్రస్టు, సింహాచలం అప్పన్న దేవస్థాన భూముల పరాధీనానికి బాధ్యులపై కఠినచర్యలు తప్పవని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ సుమారు 748 ఎకరాల భూమిని ఆలయ రిజిస్టర్ నుంచి తొలగించిన విషయాన్ని ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయా భూములను సర్వే చేయడంతో పాటు ఆ వ్యవహారంపై విచారణ జరపడానికి విజయనగరం, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్లు కిశోర్‌బాబు, ఎం.వేణుగోపాల్‌రెడ్డికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారని మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. వారు పదిరోజుల్లో నివేదికను, సంబంధిత రికార్డులను అందించిన తర్వాత ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ భూముల వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై, తద్వారా అడ్డగోలుగా లబ్ధిపొందిన వ్యక్తులపై చర్యలు తప్పవని చెప్పారు. విశాఖ నగర అభివృద్ధి, సింహాచలం పంచగ్రామాల భూసమస్య, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై మంగళవారం విశాఖ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి, ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో దేవాలయాల భూముల పరిరక్షణపై ఇటీవల దేవదాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాన్సాస్ ట్రస్టు, సింహాచలం పంచగ్రామాల భూసమస్య గురించి అధికారులు ప్రస్తావించినట్లు మంత్రి చెప్పారు. దేవాలయ భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు పట్టాలివ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు కావని స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో యథేచ్ఛగా భూఆక్రమణలు జరిగాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.వేలకోట్ల విలువైన భూములను ఆక్రమణదారుల చెరనుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తప్పు చేసినవారు తప్పించుకోలేరు వేల కోట్ల రూపాయల విలువైన సింహాచలం ఆలయ భూముల దుర్వినియోగం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలున్నారని ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఎస్టేట్స్ ఎబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సింహాచలం దేవస్థానం, మాన్సాస్ భూముల్లో జరిగిన అవకతవకలను వెలికితీస్తామన్నారు. తప్పు చేసినవారు ఎంతటివారైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పంచగ్రామాల భూసమస్య కోర్టులో ఉందని, జూలైలో విచారణకు వచ్చేలా చూడాలని అడ్వకేట్ జనరల్‌ను కోరామని చెప్పారు. పంచగ్రామాల్లో నివాసితులకు కోర్టు ఆదేశాలను అనుసరించే భూముల క్రమబద్ధీకరణ ఉంటుందని తెలిపారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరివెంకటకుమారి పాల్గొన్నారు. -
ష్... గప్‌చుప్!
సాక్షి, అమరావతి: సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల గోల్‌మాల్‌కు సంబంధించి రోజుకో వ్యవహారం వెలుగుచూస్తోంది. ఈ విషయమై రెండ్రోజులుగా ‘సాక్షి’లో వస్తున్న సంచలనాత్మక కథనాలు తెలిసిందే. తాజాగా.. ఈ 748 ఎకరాల భూబాగోతం వ్యవహారం వెలుగుచూడకుండా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలే అధికారుల నోరు నొక్కేసినట్లు తెలుస్తోంది. నిజానికి.. 2016 డిసెంబర్లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి ఆ భూములు తొలగించడానికి నాలుగు నెలల ముందే అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలతో ఆలయ ఆస్తులపై రహస్యంగా విచారణ జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ శాఖలో ఉన్నతాధికారులకు కూడా తెలీకుండా గుట్టుగా ఆలయ ఈఓ స్థాయిలో సాగుతున్న ఈ భూబాగోతం వ్యవహారం గురించి దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ఉప్పు అందింది. దీంతో అప్పటి కమిషనర్ ఈ మొత్తం తతంగంపై విచారణకు మౌఖికంగా ఆదేశిలిచ్చారు. ఈ నేపథ్యంలో.. కమిషనర్ కార్యాలయంలో భూముల వ్యవహారాలను పర్యవేక్షించే అధికారితో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించిన దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ విచారణ సాగింది. ఆరు పేజీలతో కమిషనర్‌కు నివేదిక కాగా, ఆలయాల ఆస్తుల రిజిస్టర్లో పేర్కొన్న భూముల వివరాల వారీగా ఆ ముగ్గురు అధికారులు మూడ్రోజులపాటు విచారణ జరిపి కమిషనర్‌కు ఆరు పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో.. ఎవరి నుంచి ఎలాంటి వినతులు రాకుండా ఏకపక్షంగా సదరు 748 ఎకరాలు దేవుడి భూములు కావని ప్రకటించే అధికారం ఎవరికీ లేదని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. భూములు తమవిగా ప్రజల నుంచి వినతి వచ్చినప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం విచారణ జరిపి వాటికి కమిషనర్ ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) జారీచేయాల్సి ఉంటుందని అందులో వివరించారు. లేదంటే.. దీనిపై ఎవరైనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే ట్రిబ్యునల్ తగిన ఆదేశాలు జారీచేస్తుందంటూ దేవదాయ శాఖ చట్టంలోని నిబంధనలను ఆ ముగ్గురు అధికారులు తమ నివేదికలో స్పష్టంచేశారు. కాగా, ఈ ఆరు పేజీల నివేదిక ప్రస్తుతం దేవదాయ శాఖ వద్ద భద్రంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందరూ సైలెంట్.. ఇదిలా ఉంటే.. ముగ్గురు అధికారులు అప్పటి కమిషనర్‌కు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ స్థాయిలో ఈ భూముల గోల్మాల్ యథేచ్ఛగా కొనసాగింది. కానీ, అప్పటి కమిషనర్ సహా సంబంధిత శాఖ ఉన్నతాధికారులందరూ ఒక్కసారిగా గప్‌చుప్ అయ్యారు. ఇందుకు ప్రధాన కారణం.. అప్పటి ప్రభుత్వ ముఖ్యుల నుంచి అందిన ఆదేశాలే కారణమని విశ్వసనీయ సమాచారం. -
Simhachalam Temple: అప్పన్నకే శఠగోపం
సాక్షి, అమరావతి: సెంటు స్థలం అటు ఇటు అయితే గొడవలు పడటం.. కోర్టులకు వెళ్తుండటం చూస్తున్నాం. అలాంటిది ఒక ఎకరా కాదు.. రెండెకరాలు కాదు.. ఏకంగా రూ.10 వేల కోట్లకు పైబడి విలువ చేసే 748 ఎకరాల భూములు మావి కాదంటూ దేవదాయ శాఖ పరులకు వదిలేసింది. ఇవి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు. స్వామి వారి భూములను జాగ్రత్తగా కాపాడాల్సింది పోయి.. ఎవరూ అడక్కపోయినా, ఇవి మావి కావంటూ ఇతరులకు ధారాదత్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో ఈ బాగోతం చోటుచేసుకుంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు తెర వెనుక వ్యవహారం నడపడంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దేవాలయ భూముల, ఆస్తుల పరిరక్షణలో భాగంగా దేవుడి భూములకు జియో ఫెన్సింగ్ (ఆన్లైన్ మ్యాప్‌లో సరిహద్దుల గుర్తింపు) చర్యలకు ఉపక్రమించిన క్రమంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక్క రోజులో ఒక్క కలం పోటుతో.. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పేరిట 11,282.26 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను అప్పటి విజయనగరం మహారాజులు రాసిచ్చారు. ప్రస్తుత విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉండే అడవి వరం, వెంకటాపురం, వేపగుంట, చీమాలపల్లి, పురుషోత్తపురం గ్రామాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. 1967–68లో ఈ భూముల వ్యవహారంలో ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ వివాదం కొనసాగినప్పటికీ, 1977, 78లో అప్పటి ఇనామ్ తహాసీల్దార్ ఈ భూములన్నీ స్వామి వారికే చెందుతాయని డిక్లరేషన్ జారీ చేశారు. ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ ప్రకారం అందులో కొంత భూమిని మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 9,069.22 ఎకరాలకు రెవిన్యూ అధికారులు దేవుడి పేరుతో రైతు వారీ పట్టా జారీ చేశారు. ఈ క్రమంలో 2016లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల చూపు ఈ భూములపై పడింది. ఎలాగైనా సరే కొంత భూమిని అయిన వాళ్లకు కట్టబెట్టాలని తెరవెనుక మంత్రాంగం నడిపారు. ఇందుకు దేవదాయ శాఖను పావుగా వినియోగించుకున్నారు. ఏ ఒక్కరి నుంచి వినతి కానీ, ఫిర్యాదు కానీ లేకుండానే విశాఖపట్నం నగరానికి అనుకొని ఉండే 748.07 ఎకరాల దేవుడి భూములను ఒకే రోజు దేవదాయ శాఖ ఆస్తుల జాబితాల నుంచి తొలగించేశారు. ఈ భూములు స్వామి వారివి కావని, వేరే ఎవరివోనంటూ ప్రభుత్వం 2016 డిసెంబరు 14వ తేదీన అధికారికంగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి పలు భూములను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వు ఎవరూ అడగక్క పోయినా.. అడవివరం, వేపగంట్ల, చీమాలపల్లి రెవిన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 291 సర్వే నంబర్లకు సంబంధించి కొన్నింటిలో మొత్తం భూమిని, మరికొన్నింటిలో కొంత భాగం భూమిని స్వామి వారి ఆస్తుల జాబితాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వం తొలగించింది. ఇందులో 306 ఎకరాల భూమికి సంబంధించి కుంభకోణం జరిగిందని ఇప్పటికే అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. లోతైన విచారణ జరిగితే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రాష్ట్రంలో పలు చోట్ల సామాన్య ప్రజల వ్యవసాయ భూములు తప్పుగా నమోదు కావడంతో క్రయవిక్రయాలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తరహా బాధిత రైతులు అధికారులకు అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటూ ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండేది కాదు. అలాంటిది సింహాచలం శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల విషయంలో బాధితులమంటూ ఎవరూ స్వయంగా ప్రభుత్వానికి ఎలాంటి వినతులు పెట్టుకోలేదు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తనంతట తానుగా ఆ భూములను ఆలయ రికార్డుల నుంచి తొలగించేసింది. ఈ పరిణామంతో కుంభకోణం చోటుచేసుకుందని ప్రత్యేకించి చెప్పక్కరలేదని స్థానికులు అంటున్నారు. ఏకపక్ష నిర్ణయం.. నిబంధనలు బేఖాతరు ఒకే విడత ఇంత పెద్ద మొత్తంలో భూములను ఆలయ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ జరిగిన సమయంలో విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులో ఉన్న ముగ్గురు అధికారులు ఒక్క ఏడాదిలోనే వెంట వెంటనే బదిలీ అవ్వడం గమనార్హం. తద్వారా ఈ తతంగం మొత్తంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత పుష్పవర్ధన్‌ను బదిలీ చేశారు. ఆ తర్వాత ఎన్వీఎస్ఎన్ మూర్తిని నియమించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయనను కూడా బదిలీ చేసి సుజాత అనే మరో అధికారిని జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. ఓ ఆలయ ఆస్తుల జాబితా నుంచి నిర్ణీత కారణాలతో ఏవైనా భూములను తొలగించాలంటే దేవదాయ శాఖ చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఆలయ ఆస్తుల జాబితాలో పేర్కొన్న భూములపై ఎవరన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతిపత్రం పెట్టుకుంటే ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మొదట ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)కు పంపాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనలపై ఏసీ సంతృప్తి చెందిన పక్షంలో ఆ వివరాలతో పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. సంబంధిత ఆలయ ప్రాగంణం, సంబంధిత భూముల గ్రామ కార్యాలయం, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం సహా మొత్తం ఐదు బహిరంగ ప్రదేశాల్లో ఆ పబ్లిక్ నోటీసును ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. 15 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశమివ్వాలి. ఆ తర్వాత అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకుని ఆ భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించాలి. ఆస్తుల జాబితా రిజస్టర్‌లో తొలగించిన భూముల వివరాల వద్ద సంబంధిత జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. 2010 ఆస్తుల రిజిస్టర్‌ను సాకుగా చూపి.. ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూముల తొలగింపునకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చూపిన కారణం ఏమిటంటే.. ఆ భూములను తప్పుగా నమోదు చేశారని చెప్పారు. సర్వే నంబర్ల వారీగా ‘ఇనాం బి. రిజిస్టర్ నందు పట్టా నెం.2లో ఇతర ఇనాం భూమిగా నమోదు చేయబడి దేవస్థానం టైటిల్‌డీడ్ నంబరు 3145 నందు నమోదు కాలేదు’ అని పేర్కొన్నారు. మరికొన్ని భూములను గతంలో వేరే వారికి కేటాయించారని, విక్రయించారని చూపుతూ ఈ 748 ఎకరాలను జాబితా నుంచి తొలగించారు. 2004కు ముందు వివిధ ప్రభుత్వ, ప్రజా అవసరాలకు విశాఖపట్నం జిల్లాలో సింహాచలం శ్రీవరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ భూములను చాలా సందర్భాలలో అప్పటి ప్రభుత్వాలు కేటాయింపులు చేశాయి. మధ్య తరగతి ప్రజల ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకు కొంత భూమిని నిర్ణీత ధరకు బదలాయించారు. ప్రస్తుత ఎల్జీ పాలిమర్స్ వంటి సంస్థలు రావడానికి పూర్వమే భూములను కేటాయించారు. 2000–03 మధ్యలో ఆలయ భూములను అక్రమించుకున్న వారికి నిర్ణీత ధర ప్రకారం అక్రమణల క్రమబద్దీకరణ చేసి ఎల్‌ఆర్‌సీ సర్టిఫికెట్లను జారీ చేశారు. అవన్నీ 2004కు ముందు జరిగిన పరిణామాలు. ఆలయ భూములపై హైకోర్టు తీర్పు తర్వాత ఆ భూముల అమ్మకం, కేటాయింపులపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. కాగా, 2010లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజస్టర్‌లో అప్పటి వరకు ఆలయానికి ఉండే ఆస్తులను నమోదు చేసి, మిగిలినవి తొలగిస్తూ మార్పులు చేర్పులు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 2016లో టీడీపీ ప్రభుత్వం ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాలను తొలగిస్తున్నట్టు రికార్డులో పేర్కొంది. ఆలయ ఆస్తుల కోసం ప్రత్యేక రిజిస్టర్ ప్రతి ఆలయానికి ఆ ఆలయం పేరిట ఉన్న భూములు, స్వామి వారి నగలు, నగదు రూపంలో బ్యాంకులో ఉండే డిపాజిట్ వంటి వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ ఉంటుంది. 1966 దేవదాయ శాఖ చట్టం ప్రకారం దీనిని 25వ నంబరు రిజస్టర్గా పిలిచేవారు. 1966–88 మధ్య ఈ రిజస్టర్‌ను 38వ నంబరుగా మార్చారు. 1987 తర్వాత 43వ నంబరు రిజస్టర్గా పిలుస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి స్వామి వారి ఆస్తుల వివరాల్లో చోటు చేసుకునే మార్పు చేర్పులను ఆ రిజస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. సమగ్రంగా విచారణ సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ ఆస్తుల జాబితా నుంచి 2016లో ఒకేసారి 748 ఎకరాలు తొలగించిన విషయం మా పరిశీలనకు కూడా వచ్చింది. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ అంశంపై శాఖ కార్యదర్శి వాణీమోహన్ ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాం. సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించేందుకు తగిన చర్యలు చేపట్టాం. – అర్జునరావు, దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్. -
ఆలయ భూములను కాపాడుతాం : రాష్ట్ర మంత్రులు
-
దేవరయాంజాల్: ఏ చట్టం ప్రకారం జీవో ఇచ్చారు?
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని దేవరయాంజాల్ ఆలయ భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏ చట్టం ఆధారంగా ఐఏఎస్ అధికారుల విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో 1014 జారీ చేసిందని ప్రశ్నించింది. దేవాదాయ చట్టమా.. రెవెన్యూ చట్టమా అన్నది కూడా జీవోలో ఎక్కడా పేర్కొనలేదని ఆక్షేపించింది. పాతికేళ్లుగా నలుగుతున్న ఈ వివాదంపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హడావుడిగా జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. కరోనాతో రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న భయానకమైన పరిస్థితుల్లో నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఈ విచారణకు కేటాయించడం ఎంతవరకు సమంజసమంటూ మండిపడింది. దేవరయాంజాల్ భూముల ఆక్రమణ ఆరోపణలకు సంబంధించి నోటీసులు జారీచేయకుండా అధికారులు ఎవరి భూముల్లోకీ వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ ఇచ్చేందుకు నిర్ధిష్ట సమయం ఇవ్వాలని, వారి వివరణ తీసుకున్న తర్వాతే నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించింది. అప్పటివరకు పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోరాదని, కూల్చివేతలాంటి బలవంతపు చర్యలకు పాల్పడొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లోకి రెవెన్యూ అధికారులు ప్రవేశించి సర్వే చేయడాన్ని సవాల్ చేస్తూ సదా సత్యనారాయణరెడ్డితో పాటు మరికొందరు అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి శనివారం విచారించారు. ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం ‘1925లో ఆలయాలకు నిజాం భూములు కేటాయించారు. దీంతో ఈ ప్రాంతానికి దేవరయాంజాల్గా పేరు వచ్చింది. మెజారిటీ భూములకు రిజిస్ట్రర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. 1996 సంవత్సరం నుంచి అంటే దాదాపుగా 25 ఏళ్లుగా ఈ భూములకు సంబంధించిన దేవాదాయ ట్రిబ్యునల్‌లో వివాదం నడుస్తోంది. 2021 మే 2న ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా అదే నెల 3న నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఇంత హడావుడి చర్యలను చూస్తుంటే ప్రభుత్వ ఉద్దేశాన్ని అనుమానించాల్సి వస్తోంది. మా ఇంటి పక్కన కరోనాతో ఓ వ్యక్తి శుక్రవారం చనిపోతే శనివారం ఉదయం 9 గంటలకు కానీ అంత్యక్రియలు పూర్తి చేయలేని పరిస్థితి. అదీ ఓ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకుంటేనే. అంత రద్దీగా ఉన్నాయి శ్మశానాలు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న సమయంలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈ భూములు సర్వే చేయాలంటూ హడావుడిగా జీవో జారీ చేయడం అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. పాతికేళ్లుగా నలుగుతున్న ఈ వివాదం మీద ఇంత ఆగమేఘాల మీద విచారణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం. కరోనాతో అనేక మంది మృత్యువాతపడుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇంత హడావుడిగా ఈ సర్వే చేయాల్సిన అవసరం ఉందా’అని ఏజీ బీఎస్ ప్రసాద్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. అద్దెకున్న వారినీ బెదిరిస్తున్నారు.. ‘ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా రెవెన్యూ అధికారులు అక్రమంగా వాహనాల్లో పిటిషనర్ల భూముల్లోకి ప్రవేశించారు. సర్వే పేరుతో భయానకమైన పరిస్థితులు కల్పించారు. ఆ భూముల్లో గోడౌన్లు ఉన్నాయి. గోడౌన్లను అద్దెకు తీసుకున్న వారిని ఖాళీ చేయాలంటూ అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ భూముల యాజమాన్య హక్కులు తేలే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కరోనా నేపథ్యంలో వైద్య అవసరాలకు మినహా మిగిలిన వారెవరినీ వారి భూముల నుంచి ఖాళీ చేయించడానికి వీల్లేదని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జూన్ 30 వరకు అమలులో ఉంటాయి. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారుల విచారణ కొనసాగుతోంది. నోటీసులు జారీ చేయకుండా, వివరణ తీసుకోకుండా పిటిషనర్ల భూముల్లోకి వెళ్లకుండా ఆదేశాలు జారీచేయండి’అని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ మాత్రమే: ఏజీ ఐఏఎస్ అధికారులు ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తున్నారని, కమిటీని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. కమిటీ నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని, అప్పటివరకు కూల్చివేతలు లాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని నివేదించారు. జీవో 1014కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. హడావుడి చేశారు.. ‘రికార్డుల ఆధారంగా విచారణ చేసుకోవచ్చు. పిటిషనర్ల భూముల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాల్సిందే. వాహనాల్లో వెళ్లి హడావుడి చేశారు. ప్రాథమిక విచారణకు సైతం నోటీసులు జారీ చేయాల్సిందే. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగానే అధికారులు వ్యవహరించాలి’అని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) దేవాదాయ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, సీతారామచంద్రస్వామి ఆలయ ప్రత్యేకాధికారిని ఆదేశిస్తూ విచారణను వేసవి సెలవుల తర్వాతకి వాయిదా వేసింది. మా ఇంటి పక్కన కరోనాతో ఓ వ్యక్తి శుక్రవారం చనిపోతే శనివారం ఉదయం 9 గంటలకు కానీ అంత్యక్రియలు పూర్తి చేయలేని పరిస్థితి. అదీ ఓ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకుంటేనే. అంత రద్దీగా ఉన్నాయి శ్మశానాలు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న సమయంలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈ భూములు సర్వే చేయాలంటూ హడావుడిగా జీవో జారీ చేయడం అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. పాతికేళ్లుగా నలుగుతున్న ఈ వివాదం మీద ఇంత ఆగమేఘాల మీద విచారణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం. – జస్టిస్ వినోద్ కుమార్ చదవండి: ఈటలపై ఆరోపణలు.. దేవరయాంజాల్‌లో చురుగ్గా విచారణ -
ఈటలపై ఆరోపణలు.. దేవరయాంజాల్‌లో చురుగ్గా విచారణ
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారులోని దేవరయాంజాల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణపై ఐఏఎస్ ఉన్నత స్థాయి కమిటీ విచారణ చురుగ్గా సాగుతోంది. మూడో రోజైన బుధవారం ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలున్న నిర్మాణాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలోని ఐఏఎస్ అధికారుల కమిటీ పరిశీలించింది. ఆలయ భూముల కబ్జాలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు పలువురి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీని నియమించింది. దీంతో మూడు రోజులుగా ఆలయ భూము ల్లో వెలసిన నిర్మాణాలతోపాటు భూముల వివరాలను కమిటీ బృందం సేకరిస్తోంది. కష్టంగా వివరాల సేకరణ దేవరయాంజాల్‌లోని ఆలయ భూములకు సంబంధించి 91 సర్వే నంబర్ల పరిధిలో 39 మందికి సంబంధించి 178కి పైగా వాణిజ్య కట్టడాలు ఉన్నాయి. అయితే, ఇందులో 129కి మాత్రమే ఏడాదికి రూ.1.02 కోట్ల ఆస్తి వన్ను రూపేణా తూముకుంట మున్సిపాలిటికి చెల్లిస్తున్నట్లు తేలింది. ఆలయానికి సంబంధించి దాదాపు 200 ఎకరాల్లో కమర్షియల్ షెడ్లు ఉండగా, మరో 800 ఎకరాల భూములు వ్యవసాయ భూమిగా ఉన్నట్లు తెలుస్తోంది. గోదాములు, కమర్షియల్ షెడ్లతోపాటు ప్రహరీతో నిర్మించిన భూములు వందలాది ఎకరాలుగా ఉండ టం వల్ల వీటికి సంబంధించిన యజమానుల వివరాలు తెలుసుకునేందుకు సమ యం పడుతోంది. బినామీలతోపాటు 2, 3 తరాలకు చెందిన వారు యజమానులుగా ఉన్నట్లు వెల్లడవుతుండటం.. పైగా కొందరు మరణించటం వంటి వాటి వల్ల ఆ వివరాల సేకరణ కష్టంగా మారుతోంది. డీజీపీఎస్ టెక్నాలజీతో సర్వే ఆలయ భూములు, అందులోని నిర్మాణాలకు సంబంధించిన వివరాలు పక్కాగా సేకరించేందుకు కమిటీ బృందం అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తోంది. గోదాములు, స్థలం (భూమి) లోకేషన్ ఆధారంగా డీజీపీఎస్ సర్వే చేస్తోంది. దీంతో అంగుళం కూడా తప్పిపోకుండా వివరాలు పక్కాగా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఆలయానికి సంబంధించిన 1,531ఎకరాలల్లో 178కి పైగా నిర్మాణాలు ఉండటం వల్ల సర్వే పూర్తి కావడానికి రెండు రోజులు పట్టవచ్చునని సమాచారం. పత్రాలు చూపుతున్న రైతులు ఆలయ భూముల్లో సర్వే చేస్తున్న తహసీల్దార్ల బృందాలకు రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు పాత రికార్డులు, పత్రాలు చూపిస్తున్నారు. సర్వే నంబర్లు 671, 674, 676, 714లలో పలు నిర్మాణాలు చేపట్టిన రైతులు 25 ఎకరాలకు సంబంధించిన రికార్డులను విచారణ బృందం అధికారి రఘునందన్‌రావుకు చూపించారు. 715, 717, 718 సర్వే నంబర్లలో 16 ఎకరాలున్న యాజమాని కూడా పత్రాలను అందజేశారు. చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్ Etela Rajender: ఈటలకు షాకిచ్చేందుకు ‘కెప్టెన్’ రెడీ! -
అమ్మవారి ఆస్తిని బ్యాంక్‌లో తాకట్టు
ప్రకాశం,మర్రిపూడి: వెనుకబడిన మర్రిపూడి మండలంలో దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది. అక్రమార్కులకు మర్రిపూడి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొందరు దేవదాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని పాస్‌పుస్తకాలు సృష్టించుకున్నారు. భూములు యథేచ్ఛగా ఆక్రమించుకుని అనుభవిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దేవాలయ భూములను పలు బ్యాంక్‌ల్లో తాకట్టు పెట్టి రూ.లక్షల్లో రుణాలు తీసుకుని దర్జాగా తిరుగుతున్నారు. గ్రామ దేవతలకు చెందిన భూములను కూడా వదలడం లేదు. అక్రమార్కుల చెర నుంచి గ్రామ దేవతల భూమికి విముక్తి కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ ఎస్.సువర్ణరావు, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు సోమవారం వినితిపత్రం సమర్పించారు. ఇదీ..అక్రమార్కుల దుర్బుద్ధి మండల కేంద్రం మర్రిపూడికి ఉత్తరం వైపున నూకల పరమేశ్వరి అమ్మవారి (గంగమ్మ) గుడి ఉంది. ఆ గుడిని పురాతన కాలంలో నిర్మించారని పెద్దలు చెబుతున్నారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పిచేందుకు అప్పట్లో అమ్మవారికి 20 ఎకరాలను దాతలు కేటాయించారు. 20 ఎకరాల్లో 13 ఎకరాల భూమి పూజారి కింద ఉంది. మిగిలిన అమ్మ వారి భూమిపై భూకబ్జాదారుల కన్ను పడింది. సర్వే నంబర్ 978–1లో 5.62 ఎకరాల భూమి, సర్వే నంబర్ 978–2లో 1.47 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఎక్కడ ఉందో దేవదాయ శాఖ అధికారులకు సైతం తెలియదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మర్రిపూడి, పొదిలికి చెందిన ఇద్దరు ఈ భూమిని గుర్తించి కైవసం చేసుకునేందుకు పన్నాగం పన్నారు. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు సీఎస్‌పురం మండలం పెదగోగులపల్లికి చెందిన ఆకుమళ్ల వెంకటేశ్వర్లును సంప్రదించి మర్రిపూడి రెవెన్యూ పరిధిలో మీ పూర్వికులకు చెందిన ఆస్తి ఉందని, ఆ భూమి తమకు విక్రయించాలని మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన వెంకటేశ్వర్లు పొదిలి సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి 2011 ఏప్రిల్ 18న ఆ ఇద్దరు అక్రమార్కులకు రిజిస్ట్రేషన్ చేశాడు. అమ్మవారి భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి సిండికేట్ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి దాదాపు రూ.6 లక్షలుపై చిలుకు రుణం తీసుకున్నారు. అది అమ్మ వారి భూమని తనకు తెలియదని, వారిద్దరు వచ్చి తనను ప్రలోభాలకు గురిచేసి తనతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ భూమి వెంటనే అమ్మవారికి చెందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆకుమళ్ల వెంకటేశ్వర్లు కోరుతున్నాడు. -
నారసింహుడి మాన్యం అన్యాక్రాంతం
పెద్దపప్పూరు: మండలంలోని నరసింహస్వామి మాన్యం అన్యాక్రాంతమైంది. స్వామి మాన్యాన్ని టీడీపీ మద్దతుదారులు గత ప్రభుత్వ పాలకుల అండతో ఏకంగా తమపేరున పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తిమ్మనచెరువు గ్రామసమీపంలో కొండపై ప్రసిద్ధిగాంచిన వజ్రగిరి లక్ష్మీనరసింహ్మస్వామికి సర్వేనంబర్ 244లో 3.72 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డు (డైక్లాట్)లో స్పష్టంగా ఉంది. అదే భూమిని ధర్మాపురం గ్రామానికి చెందిన ఎం.మాదన్న, ఎం. నారాయణప్ప తమ పలుకుబడిని ఉపయోగించి పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకుని నేడు పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అన్యాకాంత్రమైన భూమిని మరొకరికి కౌలుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవుడి మాన్యం అన్యాక్రాంతమైనట్లు తెలిసినా..గత పాలకులకు బెదిరి అధికారులు నోరుమెదపలేదు. ప్రస్తుతం ఆలయభూమి అన్యాక్రాంతమైందని, తగు చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులకు పూర్తి వివరాలతో కొందరు భక్తులు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపినట్లు సమాచారం. ఇప్పటి కైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్వామి వారి భక్తులు అధికారులను కోరుతున్నారు. పరిశీలించి పాసుపుస్తకాలను రద్దుచేయిస్తాం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయానికి చెందిన 3.72 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు ఆదివారం సాయంత్రం ఎవరో ఒక భక్తుడు సెల్‌ఫోన్‌కు వివరాలను మెసేజ్ పంపాడు. వెంటనే తగు చర్యలు చేపట్టాలని సంబంధిత ఆలయ అధికారి ఆదేశించాం. పూర్తిగా పరిశీలించి పట్టాదారుపాస్తకాలను రద్దు చేయించడంతో పాటు ఆలయ భూమిని తప్పక స్వాధీనం చేసుకుంటాం. – రామాంజనేయులు, దేవదాయశాఖ సహాయక కమిషనర్, అనంతపురం -
ఆలయ భూముల్లో అక్రమాలకు చెక్
కోట్లాది రూపాయల విలువైన దేవాలయ భూములను రైతులు ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూములకు శిస్తు రూపంలో ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో సాధారణ రైతుల మాదిరిగానే ఆలయాల భూములు సాగు చేసే రైతులకు కూడా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, తద్వారా శిస్తు సక్రమంగా వసూలయ్యే అవకాశముంటుందని అధికారులు గుర్తించారు. పైగా దీనివలన రైతులకు కూడా ప్రభుత్వ పరంగా రైతు భరోసా వంటి పథకాలు వర్తించనున్నాయి. దీంతో దేవదాయ శాఖ ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. సాక్షి,పిఠాపురం(తూర్పుగోదావరి) : దేవాలయాలకు చెందిన భూములు, వాటిని సాగు చేస్తున్న రైతుల వివరాలను బహిర్గతం చేయడం ద్వారా దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఆలయ భూములు సాగు చేసే వారికి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి చర్యలు ఆరంభించింది. ఇందులో భాగంగా దేవాలయ భూములను సాగు చేసే రైతుల సమగ్ర వివరాలను ఆయా మండలాల్లోని తహసీల్దార్లకు అందజేస్తున్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో స్థానిక అధికారులు ఆ పనిలో తలమునకలయ్యారు. మన జిల్లాలోని 1,724 ఆలయాలకు సుమారు 22,695 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవికాకుండా భక్తుల నుంచి నిత్యం లభించే ఆస్తులు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం భూములు ఎక్కువ శాతం అన్యాక్రాంతమై దళారుల చేతుల్లో మగ్గిపోతున్నాయి. గతంలో కొందరు దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు, కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి, తక్కువ కౌలుకు ఏళ్ల తరబడి ఇతరులకు ధారాదత్తం చేయడంతో దేవాలయాలకు చెందిన అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయి. వారికి రైతు భరోసా! కౌలు అర్హత కార్డులను ప్రభుత్వం జారీ చేస్తే ఆలయాల భూముల వివరాలు, వాటిని సాగు చేస్తున్న రైతుల వివరాలు బహిర్గతమయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దీనివలన భూమి శిస్తు కూడా సక్రమంగా వసూలవుతుందని భావిస్తున్నారు. తద్వారా ఆలయాలకు ఆదాయం పెరుగుతుంది. మరోపక్క నిజమైన కౌలు రైతుకు ప్రభుత్వం అందించే వైఎస్సార్ రైతు భరోసా సహాయం కూడా అందుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే ఆలయ భూములు సాగు చేసే రైతులకు కౌలు అర్హత కార్డులు ఇవ్వాలని, తద్వారా వారికి కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు అర్హులైన కౌలు రైతులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన వారికి వైఎస్సార్ రైతు భరోసా ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు తెలిపారు. అందరు బయటపడతారా? ఇప్పటికే దేవుడి భూములను అప్పనంగా పండించుకుంటున్న కొందరు రైతులు కౌలు గుర్తింపు కార్డుల కోసం బయటపడతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అర్హత కార్డు తీసుకోవాలంటే తాము ఎంత భూమి సాగు చేస్తున్నదీ అధికారికంగా రికార్డుల్లో చూపించాల్సి ఉంటుంది. దీంతో కొందరు ఈ కార్డులు తీసుకోడానికి సుముఖత చూపరనే వాదనలు కూడా ఉన్నాయి. శిస్తు సక్రమంగా చెల్లించేవారు ముందుకు వచ్చినా, శిస్తు ఎగ్గొట్టేవారు మాత్రం ముందుకు రాకపోవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ అధికారులు మాత్రం రెవెన్యూ రికార్డుల ఆధారంగా అన్ని భూములకు సంబంధించిన రైతుల వివరాలను బహిర్గతం చేయాలని భావిస్తున్నారు. వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నాం దేవస్థానం భూములు సాగు చేస్తున్న రైతుల్లో సక్రమంగా శిస్తు చెల్లిస్తున్న వారికి దేవదాయ శాఖ తరఫున సర్టిఫికెట్లు ఇస్తున్నాం. వాటి ఆధారంగా రెవెన్యూ అధికారులు కౌలు అర్హత కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. కొందరు రైతులు వచ్చి తమకు సర్టిఫికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. వారి వివరాలను పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఆ సర్టిఫికెట్ ఉన్న ప్రతి కౌలు రైతుకూ ప్రభుత్వం అందించే వైఎస్సార్ రైతు భరోసా ఆర్థిక సహాయం అందుతుంది. – నరసింహారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్, కాకినాడ -
స్వామి భూములు స్వాహా
సాక్షి, ఒంగోలు : ప్రతిష్టాత్మక ఆలయాలకు జిల్లా పెట్టింది పేరు. చారిత్రత విశేషాలకు, మహిమలకు నిలయమైన భైరవ కోన, త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర ఆలయాలు, సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి మాలకొండ, మిట్టపాలెం, మార్కాపురం చెన్నకేశవుడు.. ఇలా అనేక మహిమాన్విత దేవాలయాలు ప్రకాశం జిల్లాలో కొలువై ఉన్నాయి. దాదాపు 150కి పైగా ఆలయాలు దేవదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఎంతో కొంత భూమిని ఆలయ ఉద్ధరణ కోసం, పూజాదికాల నిర్వహణ కోసం పెద్దలు బహూకరించారు. నిత్య ధూప దీప నైవేద్యాల కోసం ఈ భూమిని కేటాయించారు. ఇలా జిల్లాలో అన్ని ఆలయాలకు దాదాపు 30 వేల ఎకరాలకు పైచిలుకు భూమి ఉంది. ఈ భూమిని వేలం పాటల ద్వారా కౌలుకు ఇస్తూ..దాని మీద వచ్చే ఆదాయంతో పలు ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు వినియోగిస్తున్నారు. అయితే, ఈ భూముల కేటాయింపు వ్యవహారం, వేలం, కౌలు వసూలు తదితరాల విషయంలో పారదర్శకత కొరవడుతోంది. ఇదిలావుంటే ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతోనే అనేక దేవాలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్నారు. కానీ, ఎప్పటికప్పుడు సంబంధిత దేవదాయ శాఖాధికారులు ఆలయాలకు ఉన్న భూమి వివరాల విషయంలో పారదర్శకత పాటించడం లేదు. దీంతో అనేక చోట్ల దేవదాయ భూమి ఇతర ఆక్రమణదారుల ఆధీనంలోకి వెళుతోంది. 20 వేల ఎకరాల పైనే.. దేవదాయ శాఖ పరిధిలో భూ రికార్డుల నిర్వహణ పదేళ్లుగా మందగించింది. జిల్లాలో రెగ్యులర్ అసిస్టెంట్ కమిషనర్ల నియామకం జరగకపోవం, ఎఫ్ఏసీలు జిల్లాలో ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండటం. దేవదాయ శాఖ మీద ఒకరిద్దరి ఆ«ధిపత్యమే కొనసాగటం దరిమిలా దేవదాయ భూముల లెక్కల నిర్ధారణ మీద ప్రత్యేకంగా చర్యలు చేపట్టలేదు. దీంతో ఏళ్ల తరబడి ఒకే వ్యక్తుల చేతుల్లో దేవదాయ శాఖ భూమి నిలిచి ఉండటంతో అనేకచోట్ల కొందరు అక్రమార్కులు దేవదాయ భూమిపై కన్నేశారు. దరిమిలా జిల్లాలో 20 వేల ఎకరాలపైనే దేవదాయ శాఖ భూమి ఆక్రమణదారుల చెరలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్‌కు నోచుకోని వైనం: దేవదాయ శాఖకు చెందిన భూములు ఆన్లైన్ చేసే వ్యవహారంలో జిల్లాకు వస్తున్న అధికారులు ఆసక్తి చూపటం లేదు. దీంతో పలుచోట్ల ఆలయ అభివృద్ధి కమిటీల చేతుల్లో భూములు బందీ అయిపోయాయి. దీంతో ఆలయాలకు రావాల్సిన ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతోంది. మండలం వారీగా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, ఆలయాల వారీగా ఉన్న భూమి, ఏయే ఆలయాల ఆధీనంలోని భూమి ఆన్లైన్ చేశారు అనే విషయం మీద దేవదాయ శాఖ అధికారుల వద్ద సరైప సమాచారం లేదు. అదేవిధంగా ఏయే ఆలయాలకు చెందిన ఎంతెంత భూమి సాగులో ఉంది, సాగుకు గాను చెల్లిస్తున్న కౌలు తదితరాల మీద కూడా రికార్డుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొన్నిచోట్ల దేవదాయ శాఖ భూములు ఆన్లైన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు కూడా ముందుకు రావటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతు భరోసాతో కదులుతున్న తీగ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కౌలు రైతుల సంక్షేమం కోసం ‘రైతు భరోసా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు చర్యలు చేపడుతుండగా, జిల్లాలో ఏయే భూములు, ఎవరెవరి భూములు ఎంతెంత కౌలులో ఉన్నాయనే విషయం మీద అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో తక్షణం దేవదాయ శాఖ ఆధీనంలోని భూమి వివరాలు, ఏయే ఆలయాల భూమి ఎవరెవరి వద్ద కౌలులో ఉందనే వివరాలను ప్రకటించాలని పలు ఆలయాల ధర్మకర్తలు కోరుతున్నారు.