సాక్షి, అమరావతి: వ్యవసాయేతర భూములు మినహా దేవదాయ శాఖ పరిధిలో జరిగే లీజు ఒప్పందాలకు రాష్ట్ర పరిధిలో రిజిస్టర్ చేసుకున్న సంస్థలకే ప్రాధాన్యత ఇచ్చేలా లీజు నిబంధనలు మారుస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ అంశంపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల పాటు అవకాశం కల్పించినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధన అమలులోకి వస్తే.. రాష్ట్ర పరిధిలోని ఆలయాల్లో ఎలాంటి లీజు ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా మన రాష్ట్రంలోనే ట్యాక్స్ చెల్లించేలా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment