తిరుపతి: కొంతమంది స్వార్థపరులు దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల భూములను తాకట్టు పెట్టడం కానీ, అమ్మడం కానీ చేయదని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదికాక ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ పూర్తిగా లోటులో ఉంది.
ఈ నేపథ్యంలో ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఎర్రచందన విక్రయిస్తుంది. అందుకోసం ఈ రోజు ఈ టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేవాలయాల భూమలను కూడా ప్రభుత్వం విక్రయించే అనుమానం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం దేవాలయాల భూములు అమ్మదని భావిస్తున్నట్లు భానుప్రకాశ్ రెడ్డి పై విధంగా వెల్లడించారు.