
లారీ-ఆటో ఢీ: ముగ్గురు మృతి
కారేపల్లి(ఖమ్మం జిల్లా): కారేపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న లారీ, టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.