Three persons died
-
నాడు ముగ్గురు.. నేడు ఒకరు
భీమారం(చెన్నూర్):రబీలో పండించిన ధాన్యాన్ని వర్షాలనుంచి కాపాడుకోబోయి పిడుగుపాటు గురై పలువురు రైతులు మరణిస్తున్నారు. ఇలా ఏడాదిలో నలుగురు చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లిలో గత మేనెల 13న అదే గ్రామానికి చెందిన జాడి రమేశ్, రాంటెంకి రాజయ్య, ముడిపల్లి రాజం ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాల వద్దకు వెళ్లారు. అదే సమయంలో భారీవర్షం వచ్చింది. పిడుగు పడడంతో ముగ్గురూ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఏడాది మే నెలలోనే ఇదే మండలం పోలంపల్లిలో కౌలురైతు పోశం కుమారుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజేందర్ కూడా శుక్రవారం ఉదయం వర్షం రావడంతో ధాన్యం తడవకుండా.. కవర్లు కప్పేందుకు వెళ్లి పిడుగుపాటుతో మరణించారు. ఖరీఫ్‌లో వచ్చిన పంటను అమ్ముకునేందుకు ఇబ్బంది పడని రైతులు రబీలో ఎండ ఉన్నా.. తేమశాతం పేరుతో ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో రైతులు అకాలవర్షాలతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఆ ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. గత సంవత్సరం ఆరెపల్లిలో కౌలు రైతులు పండించిన ధాన్యం భీమారంలోని కేంద్రానికి తరలించకముందే ముందు జాగ్రత్తగా ఆరబెడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడటంతో ముగ్గురు కౌలు రైతులు అనంత లోకాలకు వెళ్లారు. అప్పట్లో ఆరెపల్లి సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం అయింది. అప్పటి ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, కలెక్టర్ ఆర్వీ.కర్ణణ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు బాసటగా నిలిచారు. ఆరెపల్లిలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చినా.. ఆ హామీ ఇంతవరకు అమలు కాలేదు. ఈ ఏడు కూడా ఆరెపల్లి రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమారం కేంద్రానికి తరలిస్తున్నారు. పోలంపల్లి విషాదం కౌలు రైతు కుమారుడు రాజేందర్ ఉన్నత విద్య అభ్యసించారు. అనుకున్నట్టుగానే ప్రభుత్వ ఉపాధ్యాయుడి నియామకమయ్యారు. ఈ క్రమంలో సెలువులు రావడంతో తండ్రికి బాసటగా ఉంటున్నాడు. కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో పిడుగు పడి ఇలా అర్థాంతరంగా అనంత లోకానికి పోవడంతో అతని కుటుంబం రోడ్డున పడినట్లయ్యింది. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
సాక్షి, నెల్లూరు/అద్దంకి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా రాపూరు-కొండేరు వాగు వద్ద బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని పక్కన ఉన్న కాల్వలోకి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రాపూరు నుంచి పంగిలికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. అనంతసాగరం మండలం ఉప్పలపాడు సమీపంలో కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బైక్‌పై ఉన్నపెంచలయ్య (40) మృతిచెందాడు. మృతుడు రాపూరు మండలం గారిమినిపెంట గ్రామవాసిగా గుర్తించారు. అలాగే ప్రకాశం జిల్లా అద్దంకిలో బస్టాండు వద్ద సైక్లిస్టును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగులుప్పలపాడుకు చెందిన రాఘవరావు(40) దుర్మరణం చెందాడు. ఇతను ముఠా కూలీగా పనిచేస్తున్నాడు. -
బైక్, లారీ ఢీ: ముగ్గురు మృతి
సాక్షి, అనంతపురం: జిల్లాలోని బత్తలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుమ్మళ్లకుంట వద్ద సోమవారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్న వారిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ-ఆటో ఢీ: ముగ్గురు మృతి
-
లారీ-ఆటో ఢీ: ముగ్గురు మృతి
కారేపల్లి(ఖమ్మం జిల్లా): కారేపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న లారీ, టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దారికాసిన మృత్యువు
కాళ్ల : రహదారులపై దారి కాసిన మృత్యువు ముగ్గురిని బలిగొంది. బస్సు ఢీకొని ఒకరు, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి మరొకరు మరణించగా, చెట్టును ఢీకొన్న ఓ మోటర్సైక్లిస్టు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామానికి చెందిన దవులూరి కమలరత్నం, ఎలిజబెత్‌రాణి దంపతులు మోటార్‌సైకిల్‌పై ఉండి మండలం పెదపుల్లేరు వెళ్లి తిరిగివస్తుండగా.. కాళ్ల పీహెచ్సీ పరిధిలో రుద్రాయకోడు వంతెనపై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే దవులూరి ఎలిజబెత్‌రాణి (40) మృతి చెందారు. భర్త కమలరత్నంకు తీవ్రగాయాలయ్యాయి. మితిమీరిన వేగంతో వచ్చిన బస్సు ఢీకొనడంతోపాటు సుమారు 15 అడుగుల మేర ఈడ్చుకుపోవడంతో ఎలిజబెత్ అక్కడికక్కడే మరణించారు. కమలరత్నాన్ని భీమవరం ఆస్పత్రికి తరలించారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుతారనుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాళ్ల హెడ్‌కానిస్టేబుల్ గోపాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. భీమవరం అర్బన్ : మండలంలోని లోసరి గరవళ్లదిబ్బ వద్ద మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండల లక్ష్మీపురం పల్లిపాలెం గ్రామానికి చెందిన మల్లాడి నరసింహస్వామి (47), కలిదిండి మండలం చొరంపూడికి చెందిన తిరుమాని ఏలియా ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్‌పై నాగిడిపాలెం గ్రామంలో పనులు ముగించుకుని అర్ధరాత్రి 11 గంటల సమయంలో లక్ష్మీపురం పల్లిపాలెం వెళ్తుండగా లోసరిలోని గరవళ్లదిబ్బ గుడి వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మల్లాడి నరసింహస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుమాని ఏలియా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి ఏలియాను అంబులెన్సులో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడు ఏలియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ ఎం.కె.వి.సత్యనారాయణ బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొని మోటార్‌సైక్లిస్ట్ లింగపాలెం : చెట్టును ఢీకొని మోటార్‌సైక్లిస్ట్ మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి ఏలూరు మండలం వట్లూరు వద్ద జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామానికి చెందిన బాల బాబ్జి(40) కొంతకాలంగా ఏలూరులో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి హనుమాన్ జంక్షన్‌కు పనిమీద మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా, వట్లూరు వద్ద ఓ చెట్టును ఢీకొట్టి మరణించారు. బాబ్జి అంత్యక్రియలు బుధవారం ముడిచెర్ల గ్రామంలో జరిగాయి. బాబ్జి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాబ్జి వైఎస్సార్ సీపీ నేత బాల సుబ్బారావు ఏకైక కుమారుడు. వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళీరామకృష్ణ, కామవరపుకోట సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యంబాబులకు స్వయనా బావమరిది. బాబ్జి మృతి వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేతలతోపాటు, పలు పార్టీల నాయకులు ముడిచెర్లలోని ఆయన ఇంటికి వచ్చారు. బాబ్జి మృతదేహాన్ని ఘంటా మురళీరామకృష్ణ, చింతలపూడి మాజీ సమితి అధ్యక్షుడు మందలపు సత్యన్నారాయణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ముసునూరి వెంకటేశ్వరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రావి కొండయ్య, కె.గోకవవరం సొసైటీ అధ్యక్షుడు ఎ.సూరిబాబు సందర్శించారు. -
టాటా ఇండికా విస్తా టైరు పగిలి ముగ్గురి దుర్మరణం
(అనుమల శ్రీనివాసులు-పామూరు) ప్రకాశం జిల్లా పామూరు మండలం చిలకపాడు-నాచవాగు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. టాటా ఇండికా విస్తా వాహనం టైరు పగిలిపోవడంతో అది బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు, రెండు నెలల పాప దుర్మరణం చెందారు. కనిగిరి మండలం నేలటూరు గొల్లపల్లికి చెందిన అన్నదమ్ములు, వారి బంధువులు చెన్నై సమీపంలోని అంబత్తూరులో బేల్డారి పని చేసుకుంటున్నారు. వారు ఈ ఉదయం టాటా ఇండికా వాహనంలో తమ సొంత గ్రామం బయలుదేరారు. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చిలకపాడు, నాచవాగు గ్రామాల మధ్యకు వచ్చిన తరువాత వాహనం టైరు పగిలిపోయింది. ఆ తరువాత వాహనం ఒక రాయికి ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నడుతుపున్న జె.సురేష్ బాబు(22), ఐ.సీమోను, ఐ.మెర్సీ( రెండు నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరూ బంధువులేనని తెలిసింది. -
మిని వాహనం - లారీ ఢీకొని ముగ్గురి మృతి
విశాఖపట్నం: ఆనందపురం మండలం పెద్దిపాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.మిని వాహనం, లారీ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మృతులు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఎస్ఎంపురం, బంటుమిల్లి, షేర్ మహ్మద్ పురం గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. మృతులలో ఇద్దరి పేర్లు దాసరి రాజు, సంతోష్‌కుమార్ అని తెలుస్తోంది.