టాటా ఇండికా విస్తా టైరు పగిలి ముగ్గురి దుర్మరణం | three persons died in accident in prakasam district | Sakshi
Sakshi News home page

టాటా ఇండికా విస్తా టైరు పగిలి ముగ్గురి దుర్మరణం

Published Thu, Dec 26 2013 2:56 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

టాటా ఇండికా విస్తా టైరు పగిలి ముగ్గురి దుర్మరణం - Sakshi

టాటా ఇండికా విస్తా టైరు పగిలి ముగ్గురి దుర్మరణం

(అనుమల శ్రీనివాసులు-పామూరు)
 ప్రకాశం జిల్లా పామూరు మండలం చిలకపాడు-నాచవాగు మధ్య జరిగిన రోడ్డు  ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. టాటా ఇండికా విస్తా వాహనం టైరు పగిలిపోవడంతో అది బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు, రెండు నెలల పాప దుర్మరణం చెందారు.


కనిగిరి మండలం నేలటూరు గొల్లపల్లికి చెందిన అన్నదమ్ములు, వారి బంధువులు చెన్నై సమీపంలోని అంబత్తూరులో బేల్డారి పని చేసుకుంటున్నారు. వారు ఈ ఉదయం టాటా ఇండికా వాహనంలో తమ సొంత గ్రామం బయలుదేరారు. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చిలకపాడు, నాచవాగు గ్రామాల మధ్యకు వచ్చిన తరువాత వాహనం టైరు పగిలిపోయింది. ఆ తరువాత వాహనం ఒక రాయికి ఢీకొట్టి బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో కారు నడుతుపున్న జె.సురేష్ బాబు(22), ఐ.సీమోను, ఐ.మెర్సీ( రెండు నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు.  మృతులు ఇద్దరూ బంధువులేనని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement