సాక్షి, నెల్లూరు/అద్దంకి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా రాపూరు-కొండేరు వాగు వద్ద బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని పక్కన ఉన్న కాల్వలోకి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రాపూరు నుంచి పంగిలికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. అనంతసాగరం మండలం ఉప్పలపాడు సమీపంలో కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బైక్‌పై ఉన్నపెంచలయ్య (40) మృతిచెందాడు. మృతుడు రాపూరు మండలం గారిమినిపెంట గ్రామవాసిగా గుర్తించారు. అలాగే ప్రకాశం జిల్లా అద్దంకిలో బస్టాండు వద్ద సైక్లిస్టును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగులుప్పలపాడుకు చెందిన రాఘవరావు(40) దుర్మరణం చెందాడు. ఇతను ముఠా కూలీగా పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment