అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం
అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం
Published Sat, Oct 8 2016 11:00 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
నల్లగొండ (నల్లగొండ రూరల్) : అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబ్‌నగర్ డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ సంపత్ అన్నారు. అవినీతిపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కల్వకుర్తి నుంచి దేవరకొండ మీదుగా నల్లగొండకు 112 కి.మీ సైకిల్ యాత్ర నిర్వహించినట్లు వెల్లడించారు. సంపత్ ఆధ్వర్యంలోని సైకిల్ బృందాన్ని స్థానిక జైల్ సూరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఘనస్వాగతం పలికి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంతపత్ మాట్లాడారు. సమాజంలో అవినీతి వేళ్లూరుకు పోయిందని చివరికి పిల్లనిచ్చే వారు కూడా ఏ పోస్టింగ్‌లో ఉన్నాడు.. బాగా సంపాదిస్తారా.. అనే ఆలోచించే స్థాయికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో సైకిల్ యాత్ర బృదం తిరుమల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, లక్ష్మయ్య, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement