జిల్లా క్రికెట్‌ జట్టుకు పెదపవని విద్యార్థినుల ఎంపిక | TO DISTRICT CRICKET SELECT PEDAPAVANI STUDENTS | Sakshi
Sakshi News home page

జిల్లా క్రికెట్‌ జట్టుకు పెదపవని విద్యార్థినుల ఎంపిక

Published Thu, Jul 21 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

జిల్లా క్రికెట్‌ జట్టుకు పెదపవని విద్యార్థినుల ఎంపిక

జిల్లా క్రికెట్‌ జట్టుకు పెదపవని విద్యార్థినుల ఎంపిక

లింగసముద్రం: సీనియర్స్‌ బాలికల నెల్లూరు క్రికెట్‌ జట్టుకు మండలంలోని పెదపవని భళేరావు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యు.మాధవరావు గురువారం తెలిపారు. ఈ నెల 19న నెల్లూరులో జరిగిన క్రికెట్‌ పోటీలలో విశేష ప్రతిభ కనపరిచి జిల్లా క్రికెట్‌ జట్టుకు ఎంపికైనట్లు చెప్పారు. ఎంపికైన విద్యార్థినులు సజ్జ సాయిలక్ష్మీ, బొల్లినేని హరిప్రియ, తోటా మాధురి, ఎం.హరిత, అమూల్య, పూర్వ విద్యార్థిని తూమాటి రేణుకలను ఆయనతోపాటు, వ్యాయామ ఉపాధ్యాయడు కె.మురళిమోహన్, ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్థులు అభినందించారు. 

Advertisement

పోల్

Advertisement