నేడు, రేపు కాశినాయన ఆరాధన మహోత్సవం | Today anwards Kasinayana worship ceremony | Sakshi
Sakshi News home page

నేడు, రేపు కాశినాయన ఆరాధన మహోత్సవం

Published Mon, Dec 12 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

నేడు, రేపు కాశినాయన ఆరాధన మహోత్సవం

నేడు, రేపు కాశినాయన ఆరాధన మహోత్సవం

కలసపాడు(కాశినాయన):   మండలం పరధిలోని జ్యోతి క్షేత్రంలో వెలసిన కాశినాయన ఆరాధన మహోత్సవాలను మంగళ, బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు.ఇప్పటికే భక్తులకు అవసరమైన ఏర్పాటు పూర్తి చేశారు. వివిధ జిల్లాల నుంచి కాశినాయన భక్తులు హాజరుకానున్న దృష్ట్యా వారికి అవసరమైన సౌకర్యాలను దేవస్థానం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. నిరంతర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నందున వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చే భక్తులకు అవసరమైన మేర అన్న దానం ఏర్పాటు చేశారు.భక్తులు ఉండేందుకు అవసరమైన సత్రాలను కూడా ఏర్పాటు చేశారు.
  జ్యోతి క్షేత్రాని దర్శించుకున్న ఎమ్మెల్సీ:
 కాశిరెడ్డి నాయన తిరునాల మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఎమ్మెల్సీ  డీసీ గోవిందరెడ్డి జ్యోతి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు చేశారు.అనంతరం అక్కడ జరుగుతున్న తిరునాల ఏర్పాట్లును దగ్గర ఉండి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశిరెడ్డి నాయన స్వామి వారి ఆరాధానకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ కమిటీకి సూచించారు. కార్యక్రమంలో కరెంట్‌ రమణారెడ్డి, సింగల్‌ విండో అధ్యక్షుడు రామిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు చెన్నారెడ్డి, వడ్డమాను రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement