అనంతపురం ఎడ్యుకేషన్ : రెండు రోజుల కిందట జరిగిన కౌన్సెలింగ్‌లో జిల్లాలో 64 మంది పీఈటీలకు పీడీలుగా పదోన్నతి కల్పించారు. వీరి చేరికతో 54 మంది పీఈటీలు డిస్టర్బ్ అయ్యారు. వారికి స్థానాలు కేటాయించేందుకు శనివారం సాయంత్రం 4 గంటలకు కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అ«ధికారి లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. అందరూ విధిగా హాజరుకావాలని సూచించారు.