today councelling
-
92 మంది పండిట్లకు పదోన్నతులు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ఉన్నతీకరించిన తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితుల పోస్టులకు గురువారం పదోన్నతులు కల్పించారు. స్థానిక సైన్స్‌సెంటర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 92 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా (గ్రేడ్–1) పదోన్నతులు కల్పించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సజావుగా జరిగింది. నేడు బదిలీల కౌన్సెలింగ్ తెలుగు, హిందీ పండిట్లకు శుక్రవారం సైన్స్ సెంటర్లో బదిలీల కౌన్సెలింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. తెలుగు, హిందీ పండిట్లకు విడివిడిగా రెండు హాళ్లలో ఏక కాలంలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. తెలుగు 509 మంది, హిందీ 325 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారన్నారు. నెరవేరిన రెండు దశాబ్దాల కల గ్రేడ్–1 భాషా పండితుల పోస్టులను పండిట్ల ద్వారా భర్తీ చేయాలనే డిమాండ్ దాదాపు రెండు దశబ్దాల తర్వాత నెరవేరింది. దీంతో భాషా పండితులు సంబరాలు జరుపుకున్నారు. పదోన్నతుల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణను వారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్‌యూపీపీ తులసిరెడ్డి, ఎర్రిస్వామి, ఎస్‌ఎల్‌టీఏ నాయకులు ఆదిశేషయ్య, శివానందరెడ్డి, సలీం, వేణుగోపాల్, సలీం తదితరులు పాల్గొన్నారు. -
బదిలీలకు వేళాయె!
– నేడు డీఆర్డీఏ ఉద్యోగులకు కౌన్సెలింగ్ – పనితీరు ఆధారంగానే పోస్టింగులు అనంతపురం టౌన్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగులో బదిలీలకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ భవన్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి స్థాన చలనం కలగనుంది. 2016–17 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టనున్నట్లు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆరుగురు డీపీఎంలు, 20 మంది ఏపీఎంలు, 94 మంది సీసీలతో పాటు ఏపీఆర్‌ఐజీపీ (గ్రామీణ సమ్మిళిత పురోగతి కార్యక్రమం) కింద ఉన్న 12 మండలాల్లోని 17 మంది ఏపీఎంలను బదిలీ చేయనున్నారు. ఏపీఆర్‌ఐజీపీ మండలాల్లో పని చేస్తున్న ఏపీఎంలను రద్దు చేసి సీసీలుగా చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కౌన్సెలింగ్ వివరాలను ఇప్పటికే సంబంధిత ఉద్యోగులకు ఈ–మెయిల్ చేశారు. ఇక మూడేళ్లు దాటిన వారికి కూడా బదిలీ ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. -
54 మంది పీఈటీలకు నేడు కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్ : రెండు రోజుల కిందట జరిగిన కౌన్సెలింగ్‌లో జిల్లాలో 64 మంది పీఈటీలకు పీడీలుగా పదోన్నతి కల్పించారు. వీరి చేరికతో 54 మంది పీఈటీలు డిస్టర్బ్ అయ్యారు. వారికి స్థానాలు కేటాయించేందుకు శనివారం సాయంత్రం 4 గంటలకు కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అ«ధికారి లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. అందరూ విధిగా హాజరుకావాలని సూచించారు. -
నేడు ఆత్మ ఏటీఎం అభ్యర్థులకు కౌన్సెలింగ్
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)లో అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ (ఏటీఎం) పోస్టుల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ ఉంటుందని ఆత్మ పీడీ డాక్టర్ పెరుమాళ్ల నాగన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఆత్మ కార్యాలయంలో హాజరు కావాలన్నారు.