నేడు గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష
Published Sun, May 7 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM
- కర్నూలులో 20 సెంటర్లు ఏర్పాటు
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 9,448 మంది
- ఉదయం 10.30 నుంచి 1 గంట వరకు పరీక్ష
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్షను ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరుకానున్న 9,448 మంది అభ్యర్థుల కోసం నగరంలో 20 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. పరీక్ష పర్యవేక్షణకు ఏపీపీఎస్‌సీ నుంచి ఇద్దరు సెక‌్షన్ ఆఫీసర్లు వచ్చారు. కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు, డోన్, పగిడ్యాల తహసీల్దార్లను లైజన్ ఆఫీసర్లుగా నియమించారు. ప్రతి సెంటరుకు ఒక డిప్యూటి తహసీల్దారును సిట్టింగ్ స్క్వాడ్‌గా నియమించారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు మొదలవుతుండగా అభ్యర్థులను 10.15 గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని సెక‌్షన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలిపారు. కావున అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకుంటే మంచిది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకరావాలని సూచించారు. ఈ పరీక్షలోనూ మైనస్ మార్కులు ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోను వైట్నర్ వాడరాదు. బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాల్సి ఉంది. ఓఎంఆర్ షీట్‌లో అభ్యర్థుల ఫొటో, పేరు వివరాలుంటాయి. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వైట్నర్ అనుమతించబోమని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.
Advertisement