
నేడు శ్రీవారి ఆలయంలో ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటల తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి ఇస్తారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగా 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పన చేస్తారు. 7వ తేదీన గరుడ సేవ నిర్వహించనున్నారు. 11వ తేదీతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
అలాగే నేడు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల రద్దీగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు రద్దీగా ఉన్నాయి. భక్తులు కంపార్ట్మెంట్లు నిండి వెలుపలకు క్యూలో నిలబడి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, నడక భక్తులకు 10 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.