వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Published Tue, Jul 11 2017 11:24 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం. ఈ నెల 16వ సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వాహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు.
ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేశారు. మూలవిరాట్టుపై దుమ్ము, దూళి పడకుండా ధవళ శ్వేతవస్త్రంతో కప్పారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలు నిర్వహించారు.
Advertisement
Advertisement