Koil Alwar Thirumanjanam
-
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఫొటోలు)
-
నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,027 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్ధు చేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
Tirumala: 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల: రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమాయత్తమవుతోంది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరగనున్నాయి. 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడసేవ నిర్వహించనున్నారు. ఇక కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహన సేవలు జరగనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశముంది. ఈ క్రమంలో వారి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈనెల 20న ఉ. 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. (క్లిక్: ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్) -
శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 23 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేశారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 6.00 నుండి 11.00 గంటల సర్వదర్శనాన్నీ నిలిపివేసి గర్భాలయం, ఉప ఆలయాలు, పోటు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను శుద్ధి చేసారు. ఆ తరువాత నామకోపు, శ్రీచూర్ణణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర తిరుమంజనాన్ని ఆలయం అంతటా పూసి నీటితో శుద్ధి చేసిన అనంతరం మధ్యాహ్నం 12.00 గంటల నుండి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు . కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. -
వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం. ఈ నెల 16వ సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వాహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేశారు. మూలవిరాట్టుపై దుమ్ము, దూళి పడకుండా ధవళ శ్వేతవస్త్రంతో కప్పారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలు నిర్వహించారు. -
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేశారు. ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు వైదికంగా భక్తిశ్రద్దలతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. 11 గంటల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో భాగంగా ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశారు. ఇక మంగళవారం వీఐపీ దర్శనం కూడా రద్దు చేశారు. -
తిరుమలలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఉదయం 11 గంటల తర్వాత సర్వదర్శనం సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి రానుండటంతో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేస్తారు. ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు వైధికంగా శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దుచేశారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా మంగళవారం వీఐపీ దర్శనం నిలిపివేస్తున్నట్టు జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. -
వైభవంగా తిరుమల తిరుమంజనం
-
నేడు శ్రీవారి ఆలయంలో ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటల తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి ఇస్తారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగా 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పన చేస్తారు. 7వ తేదీన గరుడ సేవ నిర్వహించనున్నారు. 11వ తేదీతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అలాగే నేడు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల రద్దీగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు రద్దీగా ఉన్నాయి. భక్తులు కంపార్ట్మెంట్లు నిండి వెలుపలకు క్యూలో నిలబడి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, నడక భక్తులకు 10 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. -
రేపు శ్రీవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని నేటి మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ వైదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేస్తారు. ఆలయ మహాద్వారం నుంచి గర్భాలయం వరకు వైదికంగా భక్తిశ్రద్దలతో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశారు. -
తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 16న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఉగాది,ఆణఙవార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో వైదికమైన ఈ కార్యక్రమం నిర్వహించడం సంప్రదాయం. పసుపు, చందనం, కుంకుమ, తిరునామం, పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ప్రత్యేక లేపనంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేశారు. శుద్ధి కార్యక్రమం నిర్వహించిన అనంతరం దర్శనానికి అనుమతిస్తారు. దీంతో ఉదయం నిర్వహించాల్సిన అష్టదశ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో కొత్త పరదాలు అలంకరించనున్నారు. తిరుపతికి చెందిన మేకల సుబ్రమణ్యం ఐదు పరదాలను స్వామివారికి సమర్పించారు. -
ఒంటిమిట్టలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
కడప: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం కోదండ రామాలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయాన్నంతటినీ సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేయనున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 15 న ధ్వజారోహణం, 20 న కల్యాణం, 21 రథోత్సవం జరుపుతారు. కాగా కోదండ రామాలయానికి టీటీడీ, జిల్లా అధికారులు రానున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి , టీటీడీ ఈఓ సాంబశివరావు, కలెక్టర్ కేవీ రమణ, జిల్లా ఎస్పీ నవీన్ గులాటి, ఇతర జిల్లా అధికారులు హాజరుకానున్నారు. కోదండరాముని బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. -
తిరుమలలో ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం ఆళ్వార్ తిరుమంజన సేవను శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో దర్శనాలను రద్దు చేశారు. అర్చకులు సుగంధ ద్రవ్యాల లేపనాన్ని గర్భాలయ ప్రాకారాలకు పూశారు. దీంతో ఆలయ మొత్తం సువాసనలు వెదజల్లుతోంది. ఈ నెల 17 న ఆణివారి ఆస్థానంను పురష్కరించుకుని ఆలయ సుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ నిష్టగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులతో పాటు, పండితులు పాల్గొన్నారు. -
నేటి ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి దర్శనం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. భక్తుల సర్వదర్శనానికి 7 గంటలు, నడకదారిన వచ్చే భక్తుల దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అయితే నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభమవుతుందన్నారు. -
నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం!
తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతునే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచివున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 5 గంటలు పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నేడు శ్రీవారి ఆలంయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఉదయం 11 గంటల వరకు శ్రీవారి ఆలయం శుద్ధి జరుగుతుందని, ఆతర్వాత మధ్యాహ్నం12 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభమవుతుందన్నారు. -
తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల : తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరు మంజన సేవను టీటీడీ అధికారులు సంప్రదాయ బద్దంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఆరుగంటల పాటు ఆలయంలో దర్శనాలన్నింటిని రద్దు చేసి ఆలయాన్ని శుభ్రపరుస్తున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11గంటల వరకు గర్భాలయం నుండి మహాద్వారం వరకు ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి ఏటా 450కిపైగా ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తున్నారు. అందులో అత్యంత పవిత్ర కైంకర్యమే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అంటే...తమిళంలో కోయిల్ అంటే కోవెల (గుడి) అని, ఆళ్వారు అంటే భక్తుడు అని అర్థం. భక్తుని హృదయ స్థానంలో భగవంతుడు ఉన్నట్టే కోవెలలో భగవంతుడు కొలువై ఉంటాడు. పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయ, వైఖానస ఆగమోక్తంగా శుద్ధి చేసే కైంకర్యమే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం. మహాయజ్ఞం .. తిరుమంజనం క్రీ.శ.1535 నాటికి ఏడాదిలో పది దాకా బ్రహ్మోత్సవాలు జరిగేవట. ప్రతి బ్రహ్మోత్సవానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. తెలుగు నూతన సంవత్సరాది పర్వదినమైన ఉగాది, ఆణివార ఆస్థానం (జూలై), శ్రీవారి బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తిరుమల గర్భాలయంలో స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనందనిలయం. ఆనందనిలయం నుంచి ఆలయమహాద్వారం వరకు శుద్ధిచేయటమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సునుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే ‘మలైగుడారం’ అంటారు. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు. ఇక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద.. పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం/ గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. చుట్టూ తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తిచేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. గర్భాలయంలో అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. కులశేఖరపడి మొదలు మహాద్వారం వరకు ఆలయ అధికారులు, ఉద్యోగులు శుద్ధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆలయ ప్రాకారాలకు లేపనం నామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, ముద్దకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారుచేస్తారు. తిరుమంజనానికి ముందురోజే భారీ గంగాళాల్లో సిద్ధం చేస్తారు. ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనం చేస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు ప్రాకారం పటిష్టతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా సంవత్సరంలొ నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితి. ఉగాది, ఆణివార ఆస్ధానం, బ్రహ్మొత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు చేయబడినది.