
నేటి ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి దర్శనం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. భక్తుల సర్వదర్శనానికి 7 గంటలు, నడకదారిన వచ్చే భక్తుల దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
అయితే నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభమవుతుందన్నారు.