Balaji Darshan
-
TSRTC: బస్ టికెట్‌తో పాటు శ్రీవారి దర్శన టికెట్లు.. భారీ స్పందన..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) బాలాజీ దర్శన్ టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకుని.. క్షేమంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గత ఏడాది జులైలో 3,109, ఆగస్టులో 12,092, సెప్టెంబర్‌లో 11,586, అక్టోబర్‌లో 14,737, నవంబర్‌లో 14,602, డిసెంబర్లో 6,890, ఈ ఏడాది జనవరిలో 14,182 మంది బస్ టికెట్‌తో పాటు శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్లను బుక్ చేసుకున్నారు. తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం గత ఏడాది జులై నుంచి 'బాలాజీ దర్శన్'ను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల వెళ్లేందుకు బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అందుకోసం టీటీడీతో టీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. "బాలాజీ దర్శన్ టికెట్లకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ నెలలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని యాజమాన్యం కోరుతోంది. ప్రయాణ టికెట్‌తో పాటు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్‌ను సంస్థ అందిస్తోంది. ఈ టికెట్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ప్రయాణించి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. బాలాలయ మహా సంప్రోక్షణను టీటీడీ వాయిదా వేసినందున.. ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు బ్లాక్ చేసి ఉన్న శీఘ్ర దర్శన టికెట్లను తిరిగి విడుదల చేయడం జరిగింది. భక్తులు www.tsrtconline.in వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోగలరు." అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. బాలాజీ దర్శన్ టికెట్లను కనీసం వారం రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. చదవండి: టీచర్ల బదిలీలకు మళ్లీ బ్రేక్ .. బదిలీ జాబితా నిలిపివేత -
శ్రీనివాసుడి సన్నిధిలో మోదీ
-
శ్రీనివాసుడి చరణాల వద్ద ఆశీర్వాదం దొరికింది
-
శ్రీనివాసుడి చరణాల వద్ద ఆశీర్వాదం దొరికింది
పవిత్ర విజయదశమి రోజున, అందులోనూ నవరాత్రి పూర్ణాహుతి రోజున తనకు శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగిందని, ఆయన చరణాల సన్నిధిలో ఆశీర్వచనం దొరికిందని, ఇందుకు తాను ఎంతగానో ఆనందపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఒక గుర్తింపు ఉంటే.. ఆధ్యాత్మిక దేశంగా మరో గుర్తింపు ఉందని చెప్పారు. కొన్ని శతాబ్దాలుగా మన దేశం ప్రపంచానికి వసుధైక కుటుంబ సందేశాన్ని అందిస్తోందని ఆయన అన్నారు. విజయదశమి పర్వదినం రోజు, నవరాత్రి పూర్ణాహుతి రోజున శ్రీనివాసుడి చరణాల వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోగలగడం తన భాగ్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఆధ్యాత్మిక శక్తి, ఆశీర్వాదం.. ఈ రెండూ వ్యక్తి జీవితంలో సకారాత్మక ప్రభావాన్ని పెంచుతాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో శ్రీనివాసుడి ఆశీస్సులతో మన దేశం శాంతి, సౌభ్రాతృత్వాలతో ముందుకు వెళ్లాలని, భవిష్యత్తులో దేశం పేదరికం నుంచి విముక్తి పొందాలని, సామాన్యుడి జీవితాన్ని మెరుగుపరచాలని ప్రార్థించినట్లు ఆయన దర్శనం, ఆశీర్వచనం తర్వాత చెప్పారు. ఆలయ ప్రధానార్చకుడు, ఇతర అర్చకులు ఆయనను ఆలయ ప్రాంగణంలో కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు చేయించి, ఆశీర్వచనం పలికారు. సంప్రదాయ దుస్తులలో శ్రీనివాసుడి దర్శనం చేసుకున్న ఆయనను.. ఆ తర్వాత ఓఎస్డీ డాలర్ శేషాద్రి వెన్నంటే ఉండి ఆలయ ప్రాంగణం నుంచి కారు వరకు సాగనంపారు. అంతకుముందు ప్రధానార్చకుడు, ఇతర అర్చకులు ప్రధాని మోదీకి స్వామివారి శేషవస్త్రాలు బహూకరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు తదితరులు ఈ సందర్భంగా మోదీ వెంట ఉన్నారు. -
శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగింది
-
శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగింది
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి వచ్చిన తర్వాత.. తనకు శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలుగుతోందని, అందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో రూ. 190 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన గరుడ టెర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతోందని, తిరుపతికి కూడా పర్యాటక అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. పర్యాటకం అభివృద్ధి చెందడం వల్ల అందరికీ అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు. కేవలం పెద్ద సంస్థలే కాక, పండ్లు అమ్ముకునేవాళ్లు, పూలు అమ్ముకునేవాళ్లు, చాక్లెట్లు అమ్ముకునేవాళ్లు.. చివరకు 'చాయ్' అమ్ముకునేవాళ్లు కూడా పర్యాటకం వల్ల మంచి ఆదాయం పొందగలరని ఆయన చెప్పారు. తిరుపతి బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీనివాసుడి పవిత్రభూమికి వచ్చానని, ఇది తనకెంతో ఆనందం కలిగిస్తోందని చెప్పారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపి, అక్కడి నుంచి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, గవర్నర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. -
వేంకటేశ్వరుని దర్శించుకున్న రాష్ట్రపతి
-
వేంకటేశ్వరుని దర్శించుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం నాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కూడా ఉన్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఎస్డీ కపల్ స్వాగతంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అర్చకులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. -
నేటి ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి దర్శనం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. భక్తుల సర్వదర్శనానికి 7 గంటలు, నడకదారిన వచ్చే భక్తుల దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అయితే నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభమవుతుందన్నారు. -
నేడు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం!
తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతునే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచివున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 5 గంటలు పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నేడు శ్రీవారి ఆలంయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఉదయం 11 గంటల వరకు శ్రీవారి ఆలయం శుద్ధి జరుగుతుందని, ఆతర్వాత మధ్యాహ్నం12 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభమవుతుందన్నారు.