
తిరుమలలో ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం ఆళ్వార్ తిరుమంజన సేవను శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో దర్శనాలను రద్దు చేశారు. అర్చకులు సుగంధ ద్రవ్యాల లేపనాన్ని గర్భాలయ ప్రాకారాలకు పూశారు. దీంతో ఆలయ మొత్తం సువాసనలు వెదజల్లుతోంది. ఈ నెల 17 న ఆణివారి ఆస్థానంను పురష్కరించుకుని ఆలయ సుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ నిష్టగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులతో పాటు, పండితులు పాల్గొన్నారు.