- ∙రూ.25 వేలు స్వాహా
- ∙పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ఖాతాలో డబ్బులు వేస్తానని టోకరా...
Published Sat, Aug 13 2016 11:12 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
కేసముద్రం : మీ ఖాతాలో డబ్బులు వేస్తాం.. మీ ఏటీఎం, ఓటీపీ నంబర్ చెప్పండంటూ రూ.25 వేలను స్వాహా చేసి మోసగించిన సంఘటన మండలంలోని ఇనుగుర్తి గ్రామ శివారు కట్టుకాల్వ తండాలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన నూనావత్ బాలు సంవత్సరం క్రితం బతుకుదెరువు కోసం నాగపూర్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేయడానికి వెళ్లాడు. ఈ మేరకు వారు ఉద్యోగంలో చేరడానికి రూ.25 వేలు చెల్లించాలని చెప్పడంతో డబ్బులు కట్టాడు. ఆ తర్వాత అతడికి ఉద్యోగం న చ్చక తిరిగి ఇంటికి వచ్చాడు. ఈనెల 8న బాలు సెల్‌కు ఫోన్ చేసి మీరు ఉద్యోగం వదిలి వెళ్లినందుకు బోనస్ కింద రూ.7 వేలు వస్తాయని, బ్యాంక్ ఎకౌంట్ నెం బర్ చెప్పమని అడిగాడు. దీంతో అతడు నాకు ఏటీఎం లే దు, మా బాబాయి వెంకట్రాం ఏటీఎం ఉందని చెప్పాడు. ఏదైనా పర్వాలేదు చెప్పండని అడగడంతో ముందుగా ఎ కౌంట్ నెంబర్ చెప్పాడు, ఆ తర్వాత ఏటీఎంపై ఉన్న నంబ ర్లను చెప్పేశాడు, దీంతో తిరిగి బాలు బాబాయి సెల్‌కు మె సేజ్ రాగా మెసేజ్ వచ్చిన ఓటీపీ నంబర్‌ను చెప్పాలని అడిగాడు. అది కాస్త చెప్పడంతో పాటు, ఖాతాలో ఎన్ని డబ్బు లు ఉన్నాయని అడుగగా రూ.25 వేలు ఉన్నట్లు చెప్పాడు. ఈ మేరకు సదరు వ్యక్తి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి డబ్బులను మాయం చేసి మోసగించాడు. ఈ విషయం బాధితులకు తెలియలేదు. ఈనెల 11న బాలు, వెంకట్రాంలు ఇద్దరు కేసముద్రం స్టేషన్‌కి చేరుకుని, డబ్బులు అవసరం ఉండటంతో, ఏటీఎం డ్రా చేయబోయాడు. కాని డబ్బులు రాకపోవడంతో, ఎస్‌బీఐకు వెళ్లి అధికారులను సంప్రదించారు. దీంతో మీ ఎకౌంట్‌లో డబ్బులను ఇదివరకే డ్రా అయ్యాయని, ఇంకా రూ.15లు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మోసపోయిన విషయాన్ని గమనించిన బ్యాంకు అధికారుల సూచన మేరకు ఏటీఎంను బ్లాక్ చేయించారు. ఆ తర్వాత నాగపూర్ నుంచి మోసగించిన వ్యక్తి మరోసారి ఫోన్ చేశాడు. అక్కడే ఉన్న అధికారికి ఫోన్ ఇచ్చాక, మీది ఏ కంపెనీ చెప్పండని అడగడంతో సదరు వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శనివారం మండలకేంద్రానికి చేరుకుని, విలేకర్లకు వివరించాడు.
Advertisement
Advertisement