tokara
-
రూ.39.55 లక్షల స్వాహా..
వైరా : అతను బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాడు. బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులతో నవ్వుతూ మాట్లాడి, మాటలతో మచ్చిక చేసుకుంటాడు. నమ్మకం కలిగేలా పరిచయాన్ని పెంచుకోవటంతో పాటు తోటి ఉద్యోగులకు కూడా టోకరా పెట్టి పరారీ అయ్యాడు. ఎట్టకేలకు వైరా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఆ వివరాలను వైరా సీఐ నాయుడు మల్లయ్యస్వామి బుధవారం విలేకరులకు తెలిపారు. కల్లూరుకు చెందిన పిల్లి సతీష్‌కుమార్ వైరా డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ బ్యాంకుకు వచ్చి పోయే ఖాతాదారులు, రైతులతో పరిచయాన్ని పెంచుకొని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదును బదిలీ చేస్తూ మొత్తం 34 మంది ఖాతాదారుల ఖాతాలను వాడుకొని ఎవరికీ అనుమానం రాకుండా డిపాజిట్, విత్‌డ్రా చేయటం, ఓచర్లలో ఖాతాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.39,55,728 నగదును డ్రా చేసుకొని ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టి ఊడాయించాడు. మరోవైపు బ్యాంకులో సహ ఉద్యోగుల ఐడీ, పాస్ వర్డ్‌లను వినియోగించి ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించాడు. గతేడాది నోట్ల రద్దు సమయంలో ఎక్కువ పిల్లి సతీష్‌కుమార్ గత ఏడాది నోట్ల రద్దు సమయంలో ఎక్కువ నగదును వినియోగదారులు ఖాతాలకు జమచేయమని ఇవ్వటం, ఇచ్చిన నగదును ఖాతాల్లో జమచేసి వినియోగదారులకు తెలియకుండానే నగదును మాయం చేశాడు. సతీ ష్‌కుమార్ వద్ద నుంచి రూ.39,55,528 నగదును స్వాధీనం చేసుకొని, ఖమ్మం డీసీసీబీ సీఈఓ వి వసంతరావు ఫిర్యాదు మేరకు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కోర్డుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకులో లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైన బ్యాంకు ఖాతా నంబరు, పిన్ నంబర్లు తెలియజేయవద్దని సూచించారు. జల్సాలకు అలవాటు పడి... ఓ వైపు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూనే జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచనే సతీష్‌కుమార్‌ను బ్యాంకు నేరాలకు పాల్పడేందుకు చేసింది. బ్యాంకు నుంచి కాజేసిన మొత్తాన్ని విలాసాలకు వినియోగించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. -
ఉద్యోగాల పేరుతో టోకరా
తాడేపల్లిగూడెం రూరల్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వలవేసి రూ.49 లక్షలు వసూలు చేసిన ఘటనలో ఒక వ్యక్తిని అ రెస్టు చేసినట్టు తాడేపల్లిగూడెం రూరల్ సీఐ ఎన్.రాజశేఖర్ తెలి పారు. సోమవారం స్థానిక రూ రల్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఉంగుటూరుకి చెందిన దిర్శిపోము శ్యాంబాబు, విశాఖకి చెం దిన ఎం.రమణమూర్తి, కస్తూరిబాయ్ కలిసి ఎఫ్‌సీఐలో డైరెక్టర్లుగా పేర్కొం టూ ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పిస్తామంటూ రాష్ట్ర నలుమూలల్లో పలు వురి నుంచి రూ.49 లక్షలు వసూలు చేశారు. తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు, పెరవలి, విశాఖ, గణపవరం, అత్తిలి, ప్రత్తిపాడు, తెనాలి, హైదరా బాద్ ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగం రాకపోగా సొమ్ములు సైతం ఇవ్వకపోవడంతో పెంటపాడుకు చెందిన అమలాపురపు సూరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పెంటపాడు ఎస్సై సుబ్రహ్మణ్యం దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో నిందితుల్లో ఒకరు దిర్శిపోము శ్యాం బాబు స్వగ్రామం ఉంగుటూరులో ఉన్నట్టు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు సీఐ ఎన్.రాజశేఖర్ చెప్పారు. వా రి ఆచూకీ కోసం విశాఖకి బృందాన్ని పంపామన్నారు. శ్యాంబాబును కోర్టులో హాజరుపరిచామన్నారు. ఎస్సై వి.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు. -
బ్యాంకుకి టోకరా వేసిన కిలాడీ జంట
-
డ్వాక్రా..టోకరా
డ్వాక్రా రుణ మంజూరు తీరు ఇలా... 2016–17 ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.1,346.24 కోట్లు అర్ధ సంవత్సరంలో ఇచ్చింది రూ.250 కోట్లే... ఇవ్వాల్సింది ఇంకా 1096 కోట్లు 2014–15లో రూ.1,240 కోట్లు లక్ష్యం ఆ ఏడాదిలో ఇచ్చింది రూ.367 కోట్లు సభ్యులకు చేరని సొమ్ము రూ.873 కోట్లు 2015–16లో రూ.1730 కోట్లు లక్ష్యం సభ్యులకు చేరిందీ రూ.1296 కోట్లు ఇవ్వగలిగారు... చేరని సొమ్ము...రూ.434 కోట్లు కాకినాడ సిటీ : జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)కు మంజూరు చేసే రుణ లక్ష్య ప్రగతి అంతంతమాత్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 89,994 డ్వాక్రా సంఘాలుండగా, వీటి పరిధిలో 8,77,586 మంది సభ్యులుగా ఉన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 59,587 సంఘాలకు రూ.1,346.24 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 13,353 సంఘాలకు రూ.250 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. రుణ మంజూరులో ఈ అర్ధ వార్షిక ప్రగతిని పరిశీలిస్తే..ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. లక్ష్య సాధనలో విఫలం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు రుణాల కల్పనలో మొండిచేయి చూపించింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 38,233 సంఘాలకు రూ.1,240.25 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించి, కేవలం 11,326 సంఘాలకు రూ.367.25 కోట్ల మేరకు మాత్రమే రుణాలిచ్చింది. దీంతో లక్ష్యసాధనలో అధికారులు చతికిలపడ్డారు. అలాగే 2015–16లో 46,986 సంఘాలకు రూ.1,730.71 కోట్లు లక్ష్యం కాగా, 42,835 సంఘాలకు రూ.1,296.71 కోట్ల రుణాలు ఇవ్వగలిగారు. రుణాలు కల్పన లక్ష్యం మేరకు ప్రగతి సాధించలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడంతో, రుణ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేతులెత్తేసింది. మ్యాచింగ్ గ్రాంటూ లేదు ఒక్క పైసా కట్టొద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాఫీ కాదు, రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. ఆ మ్యాచింగ్ గ్రాంట్కూ దిక్కులేకుండా పోయింది. చివరికి సంఘంలోని ఒక్కో సభ్యురాలికి రూ.3 వేల చొప్పున మూల నిధిగా సంఘ ఖాతాలో జమచేసి చేతులు దులుపుకుంది. చంద్రబాబు మాయమాటలు నమ్మి æవాయిదాలు చెల్లించడం మానేసిన సంఘాలకు వడ్డీ లేని రుణం కాదు కదా, కనీసం పావలా వడ్డీ రాయితీ కూడా కోల్పోయారు. మరోపక్క బ్యాంకర్లు కొత్త రుణాల మంజూరు విషయంలో స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. వడ్డీ వ్యాపారులే దిక్కు! గతంలో బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు కాళ్లావేళ్లా పడినా రుణాలు తీసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బ్యాంకర్లు ముఖం చాటేస్తుండడంతో వ్యాపార, కుటుంబ అవసరాల కోసం డ్వాక్రా సంఘాలు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఐదు, పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా అవసరాల కోసం వారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. లక్ష్యం మేరకు రుణాల మంజూరు డ్వాక్రా సంఘాలకు నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలు మంజూరుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాం. తీసుకున్న రుణంతో ఆర్థికంగా సంఘాలు నిలదొక్కుకునేలా వివిధ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నాం. – శ్రీనివాస కుమార్, ఏపీడీ, డీఆర్డీఏ -
రూ. కోటికి టోకరా
పరారీలో ఇద్దరు చెరో రూ.50 లక్షల చొప్పున స్వాహా బాధితుల ఆందోళన భీమారం : ఫారెస్ట్ అధికారి రూ.5 కోట్లతో ఉడాయించిన ఉదం తం మరిచిపోకముందే.. గోపాలపురంలో మరో ఇద్దరు ఇదే వ్యవహారానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. గోపాలపురానికి చెందిన ఓ వ్యక్తి తనకు హైదరాబాద్‌లో కంప్యూటర్ సెంటర్ ఉందని వివిధ వర్గాలను నమ్మించాడు. ఒక్కొక్కరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు సోమ్ము చేసుకున్నాడు. చివరికి అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తేవడంతో చివరికి తాను ఉన్న ఇల్లు సైతం అమ్మకానికి పెట్టాడు. బయానా కూడా తీసుకున్నాడు. రిజిసే్ట్రన్ చేయించే క్రమంలోనే ఉడాయించాడు. అయితే రిజి సే్ట్రష¯ŒS చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి నాలుగైదు రోజులపాటు అతడి కోసం ప్రయత్నించాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో చేసేదేమిలేక లబోదిబోమంటున్నాడు. అప్పులు ఇచ్చిన వారు కూడా అతడి ఇంటికి వచ్చి వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. అలాగే హసన్పర్తికి చెంది న మరో వ్యక్తి గోపాలపురంలో ఓ షాప్ నిర్వహణ కోసం సుమా రు రూ.50 లక్షలు అప్పు చేశాడు. కొందరి నుంచి పెద్దమొత్తంలో డబ్బు అప్పుగా తీసుకోగా, మరికొందరి నుంచి రోజు వారీ చిట్టీ రూపంలో డబ్బులు తీసుకున్నాడు. అయితే వ్యాపా రంలో నష్టం రావడంతో పరారయ్యాడు. రెండు రోజులుగా రోజువారీ చిట్టీలు నడిపించేవారు అతడి కోసం ప్రయత్నించినా ఆచూకీ లభిం చలేదు. అతడి ఇంటికి వెళితే కుటుంబ సభ్యుల నుంచి సరైన సమాధానం రావడం లేదని బాధితులు వాపోయారు. -
బ్యాంక్ అధికారినంటూ టోకరా
అకౌంట్ నుంచి రూ.32,500 డ్రా మడికొండ : ఓ మహిళకు బ్యాంక్ అధికారినంటూ ఫో¯ŒS చేసి రూ.32,500 డ్రా చేసిన సంఘటన మడికొండలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జూబేద బేగంకు గుర్తు తెలియని వ్యక్తి ఫో¯ŒS చేసి ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నానంటూ హిందీలో చెప్పాడు. మీ ఏటీఎం కార్డు డెడ్ అయిపోయింది. కొత్తది పంపిస్తాం లేకుంటే బ్లాక్ అవుతుందని చెప్పి మీ ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్ చెప్పాలని అడిగాడు. ఇందుకు ఆమె ఎటీఎంపై ఉన్న నంబర్లు చెప్పగానే మూడు నిమిషాల్లోనే మొదటిసారి రూ.25,000, రెండవసారి రూ.7,500 అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసినట్లు సెల్‌కు మెసేజ్ అందడంతో ఇంట్లో వారికి విషయం చెప్పింది. దీంతో వెంటనే స్థానిక పోలీసు స్టేష¯Œలో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఖాతాలో డబ్బులు వేస్తానని టోకరా...
∙రూ.25 వేలు స్వాహా ∙పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు కేసముద్రం : మీ ఖాతాలో డబ్బులు వేస్తాం.. మీ ఏటీఎం, ఓటీపీ నంబర్ చెప్పండంటూ రూ.25 వేలను స్వాహా చేసి మోసగించిన సంఘటన మండలంలోని ఇనుగుర్తి గ్రామ శివారు కట్టుకాల్వ తండాలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన నూనావత్ బాలు సంవత్సరం క్రితం బతుకుదెరువు కోసం నాగపూర్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేయడానికి వెళ్లాడు. ఈ మేరకు వారు ఉద్యోగంలో చేరడానికి రూ.25 వేలు చెల్లించాలని చెప్పడంతో డబ్బులు కట్టాడు. ఆ తర్వాత అతడికి ఉద్యోగం న చ్చక తిరిగి ఇంటికి వచ్చాడు. ఈనెల 8న బాలు సెల్‌కు ఫోన్ చేసి మీరు ఉద్యోగం వదిలి వెళ్లినందుకు బోనస్ కింద రూ.7 వేలు వస్తాయని, బ్యాంక్ ఎకౌంట్ నెం బర్ చెప్పమని అడిగాడు. దీంతో అతడు నాకు ఏటీఎం లే దు, మా బాబాయి వెంకట్రాం ఏటీఎం ఉందని చెప్పాడు. ఏదైనా పర్వాలేదు చెప్పండని అడగడంతో ముందుగా ఎ కౌంట్ నెంబర్ చెప్పాడు, ఆ తర్వాత ఏటీఎంపై ఉన్న నంబ ర్లను చెప్పేశాడు, దీంతో తిరిగి బాలు బాబాయి సెల్‌కు మె సేజ్ రాగా మెసేజ్ వచ్చిన ఓటీపీ నంబర్‌ను చెప్పాలని అడిగాడు. అది కాస్త చెప్పడంతో పాటు, ఖాతాలో ఎన్ని డబ్బు లు ఉన్నాయని అడుగగా రూ.25 వేలు ఉన్నట్లు చెప్పాడు. ఈ మేరకు సదరు వ్యక్తి ఆన్లైన్లో కొనుగోలు చేసి డబ్బులను మాయం చేసి మోసగించాడు. ఈ విషయం బాధితులకు తెలియలేదు. ఈనెల 11న బాలు, వెంకట్రాంలు ఇద్దరు కేసముద్రం స్టేషన్‌కి చేరుకుని, డబ్బులు అవసరం ఉండటంతో, ఏటీఎం డ్రా చేయబోయాడు. కాని డబ్బులు రాకపోవడంతో, ఎస్బీఐకు వెళ్లి అధికారులను సంప్రదించారు. దీంతో మీ ఎకౌంట్లో డబ్బులను ఇదివరకే డ్రా అయ్యాయని, ఇంకా రూ.15లు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మోసపోయిన విషయాన్ని గమనించిన బ్యాంకు అధికారుల సూచన మేరకు ఏటీఎంను బ్లాక్ చేయించారు. ఆ తర్వాత నాగపూర్ నుంచి మోసగించిన వ్యక్తి మరోసారి ఫోన్ చేశాడు. అక్కడే ఉన్న అధికారికి ఫోన్ ఇచ్చాక, మీది ఏ కంపెనీ చెప్పండని అడగడంతో సదరు వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శనివారం మండలకేంద్రానికి చేరుకుని, విలేకర్లకు వివరించాడు. -
ఆర్టీసీ కార్మికులకు టోకరా !
కోదాడ: కోదాడ డిపోలో పని చేస్తున్న పలువురు కార్మికులకు రెండు రోజులుగా ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేసి మీ అకౌంట్లో ఏరియర్స్ వేస్తున్నాం.. మ కార్డు బ్లాక్అయింది మరోసారి చెక్ చేయాలి మీ ఆధార్ నంబర్, బ్యాంక్ పిన్ నంబర్ చెప్పాలని ఫోన్లు చేస్తూ వారి వివరాలను సేకరించి వారి అకౌంట్ల నుంచి అక్రమంగా డబ్బులు డ్రా చేస్తున్నాడు. సోమవారం ఓ కార్మికుడి ఖాతా నుంచి 8 వేల రూపాయలను డ్రా చేసిన అగంతకుడు మంగళవారం మరో కార్మికుడి ఖాతా నుంచి 17 వేల రూపాయలను ఇదే విధంగా డ్రా చేశాడు. దీంతో వారు లబోదిబో మంటున్నారు. కార్మికులందరికీ 82290 00176 నంబర్ నుంచే ఫోన్ వచ్చినట్టు వారు తెలిపారు. కార్మికులందరిది గ్రూఫ్ నంబర్ కావడంతో అగంతకుడు వారికే ఫ్లోన్లు చేస్తున్నాడు. కార్మికులు ఎవ్వరు తమ ఏటీఎం కార్డు వివరాలు, ఆధార్‌కార్డు వివరాలు చెప్పవద్దని బ్యాంక్అధికారులు సూచించారు. -
ఉద్యోగాల పేరుతో టోకరా!
* 19 లక్షలకు కుచ్చుటోపీ.. ఖమ్మం క్రైం: ఐక్యరాజ్య సమితి జిల్లా ప్రతినిధి ని అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి యువతకు టోకరా వేశాడు. సూటుబూటు వేసుకొని ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాడు. రూ.19 లక్షలకు కుచ్చుటోపి పెట్టి తప్పించుకు తిరుగుతున్న ఆయన మోసాన్ని ఖమ్మం డీఎస్పీ సురేష్‌కుమార్ బట్టబయలు చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో మోసగాడి వివరాలు వెల్లడించారు. మోసగాడి ప్రస్థానం ఇలా.. హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ అబిడ్స్‌కు చెం ది న మైనంపాటి సునీల్‌కుమార్ (సుబ్రమణ్యం) 2000లో ప్రైవేట్ ఆర్గనైజేషన్ యునెటైడ్ స్కూల్ ఆఫ్ ఇండియా మెంబర్‌గా సభ్యత్వం పొందాడు. తాను యూఎన్వో(ఐక్యరాజ్య సమితి) ఎన్జీవోను అని చెప్పుకునేవాడు. స్కూల్స్‌లో జీకే, ఇన్ఫర్మేషన్ టెస్టులు నిర్వహిం చేవాడు. 2008లో అప్పటి డీఈవో, కలెక్టర్‌ను కలసి యూఎన్వో రీజినల్ డెరైక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని తన పని సులువు చేసుకున్నా డు. నెమ్మదిగా జూబ్లీపురలోని కలెక్టర్ బంగ్లా పక్కనే ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. వచ్చిపోయేవారికి ఈ బంగ్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నమ్మబలికేవాడు. 2013 జనవరి 25న ఎలక్షన్వాచ్ కన్వీనర్‌గా పనిచేసిన సునీల్‌కుమార్ ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇతని ప్రసంగంతో ముగ్ధుడైన బోనకల్ మండలానికి చెం దిన రామాంజనేయులు సునీల్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రామాంజనేయులు నుంచి రూ.లక్ష వసూలు చేశాడు. అతని ద్వారా ఆరుగురి నుంచి రూ.19 లక్షల వరకు వసూలు చేశాడు. యునెటైడ్ నేషనల్ కౌన్సెల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి కొంతకాలం నిరుద్యోగులను నమ్మించాడు. ఓ ఏడుగురికి సెక్రటరీ జనరల్ యునెటైడ్ నేషనల్ కౌన్సెల్ పేరుతో ఐడీ కార్డులూ జారీ చేశా డు. రెండు నెలలుగా వేతనం చెల్లించకపోవడం తో అభ్యర్థులు పోలీసులను ఆశ్రయించారు. -
ప్రభుత్వోద్యోగాల పేరుతో టోకరా
8 మంది నుంచి రూ.8.80 లక్షలు తీసుకున్న యువకుడు జల్సాలకు అలవాటు పడి స్నేహితులనూ మోసగించిన వైనం విస్సన్నపేట : ప్రభుత్వోద్యోగాలపై యువతకు ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని ఓ యువకుడు కొందరి వద్ద నుంచి లక్షలాది రూపాయల తీసుకుని మోసగించిన ఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విస్సన్నపేటకు చెందిన దాయక తిరుపతిరావు తహశీల్దార్, ఆర్డీవో కార్యాల యాల్లో సర్వేయర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎనిమిది మంది యువతీ యు వకులను నమ్మించి సొమ్ము తీసుకుని మోసం చేశాడు. విజయవాడ శివారు గొల్లపూడికి చెందిన దాసరి శ్రీనివాసరావు వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. అపాయింట్మెంట్ ఆర్డర్, ఐడెంటిటీ కార్డు కూడా తయారు చేయించి ఇచ్చి, ఉద్యోగంలో చేరమని చెప్పాడు. శ్రీనివాసరావు వా టిని తీసుకుని సంబంధిత కార్యాల యానికి వెళ్లి అధికారులను కలిశాడు. అతడు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డరు నకిలీదని వారు చెప్పడంతో అవాక్కయ్యాడు. తిరుపతిరావుకు సొమ్ము ఇచ్చిన మిగతా వారికి ఈ విషయాన్ని చెప్పాడు. వారంతా కలిసి మంగళవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్సై దుర్గారావుకు ఫిర్యాదు చేశారు. శ్రీని వాసరావుతోపాటు నూజివీడు సమీపంలోని అన్నవరానికి చెందిన బి.శంకర్దొర, బూరవంచకు చెందిన గుడిపాటి రాజేష్, విస్సన్నపేటకు చెందిన దుర్గాప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన సిహెచ్.సంధ్య, సింహాద్రి, లక్ష్మి, రాజ్‌కుమార్ నుంచి తిరుపతిరావు మొత్తం రూ. 8.80 లక్షలు తీసుకున్నట్లు తేలింది. తమ బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము వేయించి, తమ ఏటీఎం కార్డులను ముందుగానే తీసుకుని, వాటి నుంచి సొమ్ము డ్రా చేశాడని బాధితులు తెలిపారు. తిరుపతిరావు నూజివీడులో ఐటీఐ చదివి సర్వేయర్ వద్ద అసిస్టెంట్‌గా చేస్తున్నట్లు చెప్పి అప్పటి క్లాస్మేట్లు, స్నేహితులను నమ్మించి ఉద్యోగాల పేరుతో ఇదేవిధంగా మోసగించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై బుధవారం తెలిపారు. తిరుపతిరావు జల్సాలకు అలవాటు పడి కొత్త ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశాడని పలువురు పే ర్కొంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపించే వారిని నమ్మి మోసపోవద్దని, ఇటువంటి వారితో జాగ్రత్తగా మెలగాలని ఎస్సై యువతకు సూచించారు.