నిందితుడు శ్యాంబాబు
తాడేపల్లిగూడెం రూరల్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వలవేసి రూ.49 లక్షలు వసూలు చేసిన ఘటనలో ఒక వ్యక్తిని అ రెస్టు చేసినట్టు తాడేపల్లిగూడెం రూరల్ సీఐ ఎన్.రాజశేఖర్ తెలి పారు. సోమవారం స్థానిక రూ రల్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఉంగుటూరుకి చెందిన దిర్శిపోము శ్యాంబాబు, విశాఖకి చెం దిన ఎం.రమణమూర్తి, కస్తూరిబాయ్ కలిసి ఎఫ్‌సీఐలో డైరెక్టర్లుగా పేర్కొం టూ ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఇప్పిస్తామంటూ రాష్ట్ర నలుమూలల్లో పలు వురి నుంచి రూ.49 లక్షలు వసూలు చేశారు. తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు, పెరవలి, విశాఖ, గణపవరం, అత్తిలి, ప్రత్తిపాడు, తెనాలి, హైదరా బాద్ ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు.
ఎంతకీ ఉద్యోగం రాకపోగా సొమ్ములు సైతం ఇవ్వకపోవడంతో పెంటపాడుకు చెందిన అమలాపురపు సూరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పెంటపాడు ఎస్సై సుబ్రహ్మణ్యం దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో నిందితుల్లో ఒకరు దిర్శిపోము శ్యాం బాబు స్వగ్రామం ఉంగుటూరులో ఉన్నట్టు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు సీఐ ఎన్.రాజశేఖర్ చెప్పారు. వా రి ఆచూకీ కోసం విశాఖకి బృందాన్ని పంపామన్నారు. శ్యాంబాబును కోర్టులో హాజరుపరిచామన్నారు. ఎస్సై వి.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment