కూరగాయల ధరలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. పట్టణంలో నిర్వహించే వారాంతపు సంతతో పాటు కూరగాయల మార్కెట్‌లో ప్రధానంగా టమాట ధర తగ్గింది.
జహీరాబాద్ టౌన్: నిన్నటి వరకు మండిపోయిన కూరగాయల ధరలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. పట్టణంలో నిర్వహించే వారాంతపు సంతతో పాటు కూరగాయల మార్కెట్‌లో ప్రధానంగా టమాట ధర తగ్గింది. మొన్నటి వరకు కిలో రూ.40 పలికిన టమాట ప్రస్తుతం కిలో రూ.20కే లభిస్తోంది. మిగతా కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి. చిక్కుడు, బెండ, బీరకాయ, వంకాయ, దొండకాయ కిలో రూ.40 చొప్పున పలుకుతుండగా కాలీఫ్లవర్, క్యారట్, బిన్నిస్ మాత్రం కిలో రూ.60కి లభిస్తున్నాయి. తోటకూర కట్ట రూ.10కి విక్రయించారు. ఉల్లి ధర కిలో రూ.20-30 మధ్య పలుకుతోంది.