పూడూరు: మండల కేంద్రంలో గురువార సమాచారహక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఆ చట్టం మండల కన్వీనర్ వెంకటయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి, చేవెళ్ల సీఐ ఉపేందర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు.