అనంతపురంఅగ్రికల్చర్ : మామిడి,సేంద్రియ వ్యవసాయంపై మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో రైతులకు శిక్షణ ఉంటుందని ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.శ్రీనివాసులు, డాక్టర్ విజయశంకరబాబు హాజరై మామిడి తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, సేంద్రియ పద్ధతుల ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 08554–270430, 81420 28268లో సంప్రదించాలన్నారు.