నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ
Published Fri, Aug 5 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
పాలకొండ : నాగావళి ఉపాధి శిక్షణ సంస్థ (నైరేడ్) సంస్థ నుంచి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని ప్రొగ్రామ్ అధికారి సి.నాగరాజు శుక్రవారం తెలిపారు. ఇందు కోసం ఈ నెల 10న ఉదయం 10 గంటలకు రాజాం నైరేడ్ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. స్త్రీలకు సంబంధించి హోం నర్సింగ్, డైజనర్ బ్లౌజ్, షారీ పెయింటింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ కల్పిస్తామని 18 నుంచి 40 ఏళ్లు వయస్సు కలిగిన వారు ఇంటర్వూ్యలకు హాజరు కావాలని కోరారు. పురుషులకు సంబంధించి సెక్యూరిటీ గార్డు, మెుబైల్ ఫోన్ సర్వీసింగ్, ట్యాక్సీ డ్రైవింగ్‌లో శిక్షణ అందిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి వరకు చదువుకుని 40 ఏళ్లులోపు వయస్సు ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు 9989057451, 9502845558 నంబర్లకు సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement