ఎస్సీ న్యాయవాదులకు త్వరలో వృత్తి శిక్షణ | training for SC advocates will soon | Sakshi
Sakshi News home page

ఎస్సీ న్యాయవాదులకు త్వరలో వృత్తి శిక్షణ

Published Thu, Jul 21 2016 12:08 PM | Last Updated on Sat, Sep 15 2018 2:58 PM

ఎస్సీ న్యాయవాదులకు త్వరలో వృత్తి శిక్షణ - Sakshi

ఎస్సీ న్యాయవాదులకు త్వరలో వృత్తి శిక్షణ


హన్మకొండ అర్బన్‌ : జిల్లాలో అర్హులైన ఎస్సీ న్యాయవాదులకు ప్రభుత్వ న్యాయవాది వద్ద వృత్తి శిక్షణ ఇప్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దళిత కులాల అభివృద్ధి సంస్థ డీడీ శంకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదని, గతంలో శిక్షణ పొందని వారు మాత్రమే అర్హులని ఆయన చెప్పారు. శిక్షణలో మొత్తం 8 సీట్లు ఉన్నాయని ఆయన వివరించారు. ఈనెల 30వ తేదీలోపు కార్యాలయం పనివేళల్లో హన్మకొండ కలెక్టరేట్‌లోని దళిత కులాల అభివృద్ధి శాఖలో శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణ కోసం ఇంటర్వూ్య పద్ధతి ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని డీడీ శంకర్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement