'టీఆర్ఎస్ వెన్నుపోటు పోడిచింది'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి, ఆత్మగౌరవానికి, నిజాం వ్యతిరేక పోరాటానికి టీఆరెఎస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు. .ప్రభుత్వ పరంగా సెప్టెంబర్ 17 వేడుకలు జరపాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజాం ప్రత్యేక దేశం కోరుకున్నాడని, సర్దార్ పటేల్ రూపంలో పాత హైదరాబాద్కు స్వాతంత్ర్యం వచ్చిందని కేంద్రమంత్రి హన్స్రాజ్ ఆహిర్ అన్నారు. రజాకారుల దురాగతాలు అంతమైన రోజును అవతరణ దినోత్సవంగా జరిపితే సబబుగా ఉంటుందని చెప్పారు. మరోపక్క మజ్లిస్ మెప్పుకోసం, రజాకారుల వారసుల కోసం సెప్టెంబర్ 17ను చేయకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు.