ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తరగతి పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతిని తొలగించడంపై టీఆర్ఎస్ మండిపడింది.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తరగతి పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతిని తొలగించడంపై టీఆర్ఎస్ మండిపడింది. ఈ జీవోను తక్షనమే ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ తెలిపారు. ఒకవేళ అలా చేయకుంటే హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై విగ్రహాలను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తమ ఉద్యమం ప్రజలపై కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.