
రికార్డు ఆధిక్యం దిశగా టీఆర్ఎస్
వరంగల్: లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2014లో ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసిన కడియం శ్రీహరి 3,92,137 (30.90 శాతం) ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యపై విజయం సాధించారు.
తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పసునూరి దయాకర్ పోటీ చేశారు. నేడు ఓట్ల జరుగుతున్న ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం లభిస్తోంది. 11 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థికి 3 లక్షల 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీలో ఉన్నారు.
ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ పార్టీకి 62 శాతం ఓట్లు వచ్చినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారు పార్టీ హవా ఇలాగే కొనసాగితే మెజారిటీ 5 లక్షలు దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.