
పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే పైచేయి
వరంగల్: పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నాలుగు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడడం గమనార్హం. మొత్తం 500 మందికి పోస్టల్ బ్యాలెట్స్ పంపించారు.
మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి ఫలితం వచ్చే అవకాశముంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు.