రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | Two Died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published Sun, Feb 5 2017 12:14 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పెండ్లిమర్రి: కడప–పులివెందుల ప్రధాన రహదారిలోని వైవీయూ బైపాస్‌ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్లటూరుకు చెందిన పుల్లయ్య(40), మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డి(38) మృతి చెందారు. హరీష్‌(10)కు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వెల్లటూరుకు చెందిన పుల్లయ్య, శేఖర్‌రెడ్డిలు సొంత పని నిమిత్తం కడపకు వెళ్లి పని ముగించుకొని స్వగ్రామానికి రెండు ద్విచక్ర వాహనాల్లో మాట్లాడుకుంటూ వస్తుండగా వైవీయూ బైపాస్‌ రోడ్డు వద్ద వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పుల్లయ్య, శేఖర్‌రెడ్డిలు అక్కడికక్కడే మృతి చెందారు. పుల్లయ్య కుమారుడు హరీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని కడప రూరల్‌ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్‌ఐ రోషన్‌లు పరిశీలించారు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదామా...హత్యచేశారా?
పుల్లయ్య,శేఖర్‌రెడ్డిలు ఇద్దరూ వ్యాపారులే. వ్యాపార లావాదేవీల కారణంగా ఎవరైనా రోడ్డు ప్రమాదం జరిగేలా చేశారా లేక వాహనాలతో గుద్ది చంపారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరూ ఒకే వాహనంలో కాకుండా రెండు వాహనాల్లో వస్తున్నా శేఖర్‌రెడ్డికి బలమైన గాయాలు ఉన్నాయి. పుల్లయ్యకు పెద్దగా గాయాలు కనిపించడం లేదు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement