రెండు తలల పాము రూ. 40 లక్షలు.. | two headed snake at Rs 40 million | Sakshi
Sakshi News home page

రెండు తలల పాము రూ. 40 లక్షలు..

Published Mon, Aug 15 2016 7:20 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

two headed snake at Rs 40 million

-  విక్రయదారుడు అరెస్ట్
కుత్బుల్లాపూర్

 రెండు తలల పాము ను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూరారం రాజీవ్‌గృహకల్పకు చెందిన వెంకటేశ్ వద్ద నున్న రెండు తలల పామును రూ. 40 లక్షలకు బేరం ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సోమవారం దేవరయాంజాల్ సాయి గీత ఆశ్రమం వీకర్ సెక్షన్ కాలనీ సమీపంలో పాము ను ఉంచి ఓ వ్యక్తితో బేరం ఆడుతుండగా మాటు వేసిన ఎస్‌ఓటీ పోలీసులు వెంకటేశ్‌ను పట్టుకుని పామును స్వాధీనం చేసుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement