రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
-
అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు
-
నుజ్జునుజ్జయిన ద్విచక్ర వాహనం
-
మృతులు ఖమ్మం జిల్లా బయ్యారం వాసులు
మహబూబాబాద్ రూరల్ : అతి వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మహబూబాబాద్ పట్టణ శివార్లలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు మహబూబాబాద్ టౌన్ సీఐ నందిరాం కథ నం ప్రకారం ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా గొర్మిళ్లకు చెందిన బానోత్ సేట్‌రాం(47), ఓ మహిళతో టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై మానుకోట నుంచి గొర్మిళ్లకు వెళ్తున్నారు. ఈక్రమంలో గూడూరు నుంచి మానుకోటకు వస్తున్న కారు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘ టనలో బానోత్ సేట్‌రాంతో పాటు మహిళ వాహనం పైనుంచి ఎగిరిపడ్డారు. ఈ మేరకు వారు అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నుజ్జునుజ్జయింది. కాగా, కారు వేగంగా వెళ్లి రాళ్లను ఢీకొట్టి ఆ గిపోవడంతో డ్రైవర్ పారిపోయాడు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ రాజమహేంద్రనాయక్, టౌన్, రూరల్ సీఐలు నందిరాంనాయక్, కృష్ణారెడ్డి, ఎస్సైలు తిరుపతి, జి తేందర్ పరిశీలించి మృతదేహాలను మార్చురీకి తరలించారు. కాగా, ఘటనలో సేట్‌రాంతో పాటు మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.