గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఇద్దరు మహిళలు మరణించారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రురాలిని గుంటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సదరు మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.... పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్వే ట్రాక్పై ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి మహిళలు ట్రాక్ దాటి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.